మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!
అగ్రరాజ్యం అమెరికా మరోసారి మారణహోమానికి వేదికైంది. జాత్యహంకారం, ఇతర నేరాలకు కేరాఫ్‌గా ఉండే జార్జియా రాష్ట్రంలో మరో కిరాతక సంఘటన చోటుచేసుకుంది. జార్జియా రాజధాని అట్లాంటా సిటీలో ఓ సాయుధుడు నెత్తుటేరులు పారించాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఇప్పటిదాకా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఆసియా వాసులు కూడా ఉన్నారని పోలీసులు ప్రకటించడం అక్కడి భారతీయులను కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళితే..
షాకింగ్: బట్టలు విప్పి వీడియో తీశారు -జోగిని శ్యామలపై మహిళ ఫిర్యాదు -జీరో ఎఫ్ఐఆర్ -భారీ ట్విస్ట్

స్పా, మసాజ్ సెంటర్లే లక్ష్యంగా
జార్జియా రాజధాని అట్లాంటా సిటీలో మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్లే లక్ష్యంగా ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 నుంచి 6.00గంటల మధ్య ఈ మారణహోమం జరిగింది. అట్లాంటా సిటీ ఈశాన్య ప్రాంతంలోని వేర్వేరు దుకాణ సముదాయాల్లో కాల్పులు జరిగాయి. అందులో..
కిమ్ జాంగ్ మరో సంచలనం -నిద్ర పోవాలని లేదా? -బైడెన్‌కు యో వార్నింగ్ -భారత్‌కు రావాల్సి ఉండగా

మృతుల్లో ఆసియా వాసులు..
అట్లాంటా సిటీ కాల్పులకు సంబంధించి పోలీసులు రాబర్ట్ అరోన్ లాంగ్(21) అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిటీలోని చైజర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గోల్డ్ స్పా, దానికి కొద్దిగా దూరంలోని అరోమా థెరపీ స్పా, మరో మసాజ్ సెంటర్లలో ఈ కాల్పులు జరిగాయి. సాయంత్రం 4.30కు దోపిడీ జరుగుతోందంటూ పోలీసులకు కాల్ రాగా, సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే దుండగుడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. చనిపోయిన 8 మందిలో దాదాపు అందరూ మహిళలే కాగా, వారిలో ఆసియా సంతతివారు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

బైడెన్ హయాంలోనూ తొలి ఘటన..
ట్రంప్ ఏలుబడిలో ప్రజ్వరిల్లిన హింస.. జోబైడెన్ హయాంలోనూ కొనసాగుతున్నది. అయితే డెమోక్రాట్లు గద్దెనెక్కిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మారణహోమం జరగడం మాత్రం ఇదే తొలిసారి. అట్లాంటా కాల్పుల మృతులు, అనుమానితుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించాల్సిఉంది. ఇదిలా ఉంటే, గత ఆదివారం కూడా చికాగోలో ఓ వేడుకలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు.