వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా హైఅలర్ట్: ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా హైఅలర్ట్‌ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో నివసిస్తోన్న తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. దీనికి కారణాలు లేకపోలేదు. భయానక ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అల్ జవహరిని మట్టుబెట్టడమే. దీనితో అల్‌ఖైదా లేదా దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు అమెరికన్ పౌరులపై ప్రాణాంతక దాడులు చేయడానికి అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

కాబుల్‌లో..

కాబుల్‌లో..

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను చేపట్టింది. అతణ్ని మట్టుబెట్టింది. రాజధాని కాబుల్ సమీపంలోని షెర్పూర్ ప్రాంతంలో నివసిస్తోన్న జవహరిపై మెరుపు దాడులు చేసింది. అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ- పర్యవేక్షణలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో జవహరి మరణించాడు. తాలిబన్ ప్రభుత్వానికి కూడా తెలియకుండా ఈ ఆపరేషన్‌ను ముగించింది అమెరికా.

తాలిబన్లు భగ్గు..

తాలిబన్లు భగ్గు..


అల్ జవహరి హత్యాకాండను ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. బాహటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. అమెరికా ఈ సీక్రెట్ ఆపరేషన్‌ను నిర్వహించడం అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తమ దేశంలో నివసించే ఓ వ్యక్తి కోసం అమెరికా కనీసం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాడులకు పాల్పడటాన్ని తప్పుపట్టింది.

ప్రతీకార దాడులు..

ప్రతీకార దాడులు..

అటు అల్‌ఖైదా ఉగ్రవాదులు సైతం అమెరికా దాడుల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామనీ అమెరికాను హెచ్చరించారు. ఇదివరకట్లా దాడులు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, దానికి అవసరమైన ఆయుధ సామాగ్రి, నెట్‌వర్క్ సైతం ఉందని స్పష్టం చేశారు. అల్ జవహరి హత్యకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవడానికి అమెరికా సంసిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు అల్‌ఖైదా ఉగ్రవాదులు.

 హైఅలర్ట్..

హైఅలర్ట్..

ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అమెరికా అప్రమత్తమైంది. ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో నివసిస్తోన్న తమదేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లే అమెరికన్లు.. ఆయా దేశాల తాజా స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడితే- రాయబార కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొంది.

 రాయబార కార్యాలయాల బందోబస్తు పెంపు..

రాయబార కార్యాలయాల బందోబస్తు పెంపు..

సమస్యాత్మక, సున్నిత దేశాల్లో కొనసాగుతోన్న తమ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది అమెరికా. రాయబారులు, హైకమిషనర్లు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రతను పెంచింది. అల్‌ఖైదాకు గట్టి పట్టు ఉన్నట్టుగా భావించే దేశాల్లోని హైకమిషనర్ కార్యాలయాలు, ఎంబసీల వద్ద గస్తీని ముమ్మరం చేసింది. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా.. వాటిని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొంది.

English summary
The US has issued a worldwide caution alert following the death of al-Qaeda leader Ayman al-Zawahiri in Kabul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X