వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Monkeypox: కెనడా, ఐరోపా దేశాలను వణికిస్తున్న వ్యాధి: యూఎస్‌లో తొలి కేసు, సెక్స్ ద్వారానే వ్యాప్తి ఎక్కువ

|
Google Oneindia TeluguNews

మాంట్రియల్: మే నెల నుంచి నార్త్ అమెరికా, యూరోప్ దేశాల్లో పదుల సంఖ్యలో మంకీపాక్స్ కేసులు వెలుగుచూస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో వ్యాపించిన ఈ వ్యాధి ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లో వ్యాపిస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

వణికిస్తున్న మంకీపాక్స్.. అమెరికాలో తొలి కేసు నమోదు

వణికిస్తున్న మంకీపాక్స్.. అమెరికాలో తొలి కేసు నమోదు

స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో 40కిపైగా మంకీపాక్స్ కేసులు వెలుగుచూడగా, తాజాగా కెనడాలోనూ డజన్లలో కేసులు నిర్ధారరించారు. మే 6 నుంచి బ్రిటన్‌లో తొమ్మిది కేసులు వెలుగుచూశాయి. కాగా, యూనైటెడ్ స్టేట్స్ తాజాగా, తొలి కేసు నమోదు చేసింది. కెనడాకు వెళ్లి వచ్చిన మసాచూసెట్స్ కు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు తేలింది.

ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే వ్యాపించే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి తొలిసారిగా, యూరోప్, అమెరికా దేశాలకు వ్యాపించింది. మంకీపాక్స్ వ్యాధి సోకినవారు వారాలపాటు అనారోగ్యానికి గురవుతారు. అయితే, ఈ వ్యాధి సోకినవారిలో మరణాలు తక్కువగానే ఉంటున్నాయి. మంకీపాక్స్ వ్యాప్తి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ).. ఐరోపా, యూకే వైద్యాధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది.

యూకేలో మంకీపాక్స్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్

యూకేలో మంకీపాక్స్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్

ఇన్ఫెక్టియిస్ డిసీజ్ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ మేరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే వ్యాపించిన దేశాల్లో మంకీపాక్స్ గురించిన కీలక విషయాలను గమనించి, వ్యాప్తి కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, ఎలాంటి ఇబ్బందులుంటాయనే విషయాలపై అధ్యయనం పూర్తిస్థాయిలో జరగాలన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఇక్కడ మంకీపాక్స్ వ్యాప్తి పుంజుకుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరుగడం వల్లే వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని తెలిపింది. ఇప్పుడు ఐరోపా మొత్తం కేసులు వెలుగుచూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

సెక్స్ ద్వారానే మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి

సెక్స్ ద్వారానే మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి

గే, బైసెక్సువల్, లేదా పురుషులు, పురుషులు సెక్స్ చేసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందనే విషయంపై అధ్యయనం జరగాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. పురుసులతో పురుషులు సెక్స్ చేసుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోస్ ఫల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. యూకేలో ఈ అంశంపై విస్తృత స్థాయిలో అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు. సెక్స్ చేసుకోవడం వల్ల డైరెక్ట్‌గా కలుస్తారు కాబట్టి.. తొందరగా ఈ వ్యాధి వ్యాపిస్తుందని యూకేహెచ్ఎస్ఏ వెల్లడించింది.

మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు..

మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు..

శారీరకంగా కలవడంతోపాటు వ్యాధి సోకిన వ్యక్తితో ఆహారం, వస్త్రాలు, బెడ్ పంచుకోవడం వల్ల కూడా మంకీపాక్స్ సోకే అవకాశం ఉందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ ఒక ప్రటకనలో తెలిపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తుల్లో ఫ్లూ లాంటి లక్షణాలైన జ్వరం, కండరాల నొప్పి, ముఖం, బాడీపై దురద, పొక్కులు రావడం జరుగుతుందని పేర్కొంది.

బాధిత వ్యక్తులు ఆస్పత్రిలో చేరుతున్నప్పటికీ.. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపింది. చికిత్సతో వ్యాధి నయమవుతుందాని వైద్యులు చెబుతున్నారు. కెనడాతోపాటు యూకే, యూఎస్ లలోనూ వ్యాధి వ్యాప్తి అధ్యయనాలు జరుగుతున్నాయి.

English summary
US Confirms 1st Case Of Monkeypox - Man Who Recently Travelled To Canada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X