భారత్‌పై అమెరికాది కపట ప్రేమే: యూన్ ‘వీటో’నే నిదర్శనం
భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని, ఆసియాలోనే తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామని నాటి నుంచి నేటి వరకు అదే మాట చెబుతోంది అమెరికా. గతంలో ఒబామా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్,
వాషింగ్టన్: భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని, ఆసియాలోనే తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామని నాటి నుంచి నేటి వరకు అదే మాట చెబుతోంది అమెరికా. గతంలో ఒబామా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా, ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇదంతా భారత్‌పై అమెరికా చూపుతున్న కపట ప్రేమేనని తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది.

ఎలాగంటే..
ఐక్యరాజ్య సమితి (యూఎన్) భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి పూర్తిగా మద్దతిస్తామని ఇప్పటికే అమెరికా హామీ ఇచ్చింది. అయితే, వీటో పవర్ మాత్రం ఉండదని మెలిక పెడుతోంది. తాజాగా మరోసారి అమెరికా ఇవే వ్యాఖ్యలు చేయడం భారత్‌పై ఏ మాత్రం పేముందో తెలుస్తోంది.

భండారీకి శుభాకాంక్షలు చెబుతూ..
అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) సభ్యుడిగా మరోసారి ఎన్నికైన జస్టిస్ దల్వీర్ భండారీకి అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలో 15 ఓట్లు ఆయనకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు తొలిసారి ఐసీజేలో సభ్యత్వం లేకుండా పోయింది. భండారీకి శుభాకాంక్షలు చెప్పిన సందర్భంలోనే ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వంపై స్పందించింది.

వీటో పవర్ ఇచ్చేది లేదంటూ..
అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి భద్రతా మండలిలో వీటో పవర్ విస్తరణ గురించి వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్యను 15కు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. అయితే, సంస్కరణలకు ఇష్టమున్నా ప్రస్తుత వీటో పవర్ నమూనాలో మార్పు చేసేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది.

వ్యతిరేకమంటోంది.. ఇంకెందుకు?
‘సంస్కరణలు చేసిన మండలి 21వ శతాబ్దం పరిస్థితులను ప్రతిబింబిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత సవాళ్లను సమర్థతతో ప్రభావవంతంగా పరిష్కరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. వీటో పవర్ విస్తరణను మాత్రం మేం వ్యతిరేకిస్తున్నాం' అని అమెరికా స్పష్టం చేయడం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పట్నుంచో వేచి చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధాని మోడీ ఇందుకోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఐతే భారత్‌కు వీటో అధికారం లేకుండా శాశ్వత సభ్యత్వం ఇచ్చినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications