అమెరికా సంచలన వ్యాఖ్యలు, సింగ్ పన్నూ హత్యకు భారతీయుడిని బాధ్యుడు, యూఎస్ !

అమెరికన్-కెనడియన్ జాతీయుడు, సిక్కు వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూ అలియాస్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయశాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా అనే వ్యక్తి గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడని అమెరికా అటర్నీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండిస్తోంది.

అయితే అమెరికా నుంచి అందిన సమాచారం మేరకు ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరపడానికి భారత ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.

US Department of Justice accuses Indian of conspiring to kill Sikh separatist Gurpatwant Singh Pannu

నవంబర్ 20వ తేదీన సిక్కు వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మీద జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారు ప్రమాదంలో ఉన్నారని పన్నూ మెసేజ్ లు పంపించాడని, విమాన ప్రయాణికలను ఆందోళనకు గురి చేశాడని సిక్కు వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మీద కేసు నమోదు చేశారు.

అయితే అంతకు ముందే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారత్ మీద ఇలాంటి ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారతీయ ఏజెంట్ల ప్రయేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఖండించింది. కెనడా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు జరిపిన రెండు నెలల తరువాత అమెరికా న్యాయ శాఖ కూడా భారత్ మీద ఆరోపణలు చేస్తోంది.

US Department of Justice accuses Indian of conspiring to kill Sikh separatist Gurpatwant Singh Pannu

భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ నిషేధిత ఖిలిస్థాన్ టైగర్ ఫోర్స్ కు చీఫ్ గా పని చేస్తున్నాడు. ఇదే ఏడాది జూన్ నెలలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైనాడు. నిజ్జర్ ను భారత ఏజెంట్లు హత్య చేశారని కెనడా ప్రధాని ట్రూడో అప్పట్లో ఆరోపించారు. ఈ కేసుతో మాకు సంబంధం లేదని, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని భారత ప్రభుత్వం ఇప్పటికే కెనడాకు కౌంటర్ ఇచ్చింది. అయితే ఇంతకాలం అయినా కెనడా మాత్రం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇప్పటికీ నీళ్లు నములుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+