వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక వైట్‌హౌస్ గడప దాటనున్న ట్రంప్: కరోనా మాయం: టెస్టింగ్ ఏంటో తెలుసా?: కంచుకోటలో తొలి ర్యాలీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విడత ఎన్నికల ప్రచార ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలం పాటు ఆసుపత్రిలో, అనంతరం తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో గడపాల్సి వచ్చింది. ఇక మళ్లీ ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనబోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత డొనాల్డ్ ట్రంప్ పాల్గొనబోయే తొలి ర్యాలీ ఇదే అవుతుంది.

డొనాల్డ్ ట్రంప్‌‌ ఆరోగ్యంపై బెంగ: తెలంగాణ వీరాభిమాని ట్రంప్ కృష్ణ మృతి: గుడి కట్టిన అభిమానండొనాల్డ్ ట్రంప్‌‌ ఆరోగ్యంపై బెంగ: తెలంగాణ వీరాభిమాని ట్రంప్ కృష్ణ మృతి: గుడి కట్టిన అభిమానం

 వరుసగా అయిదురోజుల పాటు..

వరుసగా అయిదురోజుల పాటు..

డొనాల్డ్ ట్రంప్‌నకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. వరుసగా అయిదురోజుల పాటు ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు వైట్‌హౌస్ ఫిజీషియన్లు. తాజాగా నిర్వహించిన టెస్టింగ్‌లోనూ డొనాల్డ్ ట్రంప్‌నకు నెగెటివ్ వచ్చినట్లు ఫిజీషియన్ నిర్ధారించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెయిలే మెక్ఎనానీ తెలిపారు. అబాట్ బిన్‌జాక్స్‌నౌ యాంటీజెన్ కార్డ్ ద్వారా అధ్యక్షుడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు.

 ఆర్ఎన్ఏ అండ్ పీసీఆర్‌లతో..

ఆర్ఎన్ఏ అండ్ పీసీఆర్‌లతో..

యాంటీజెన్ ద్వారా ఆయనకు పలుమార్లు కరోనా నిర్ధారణ పరీక్షలను చేపట్టినట్లు మెక్ఎనానీ చెప్పారు. దీనికి అనుబంధంగా వైరల్ లోడ్, ఆర్ఎన్‌ఏ, పీసీఆర్ విధానాలు వంటి అందుబాటులో ఉన్న అన్ని లాబొరేటరీ డేటాల ఆధారంగా డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పారు. సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ట్రంప్‌నకు వైద్య పరీక్షలను చేశామని, ఆయనలో సీజనల్‌గా సంభవించే ఏ ఇతర ఫ్లూ లక్షణాలు గానీ, వ్యాధులు గానీ కనిపించలేదని వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారమే..

షెడ్యూల్ ప్రకారమే..

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తోంది. వచ్చేనెల 3వ తేదీన అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పోలీంగ్‌ను నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారమే.. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాలో నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొనడానికి వెళ్తారని వైట్‌హౌస్ వెల్లడించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఫ్లోరిడాలో రిపబ్లికన్ పార్టీకే చెందిన గవర్నర్ నిర్వహించే ర్యాలీలో ట్రంప్ పాల్గొనాల్సి ఉంది.

డిబేట్‌పై అనుమానాలు..

డిబేట్‌పై అనుమానాలు..

నిజానికి- ఎన్నికల ప్రచార ర్యాలీల్లో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల క్యాండిడేట్ జొ బిడెన్ మధ్య ఈ నెల 15వ తేదీన రెండో విడత డిబేట్‌ను నిర్వహించాల్సి ఉంది. ట్రంప్ కరోనా బారిన పడటం వల్ల ఈ డిబేట్‌లో తాను పాల్గొనబోనని ఇటీవలే జో బిడెన్ ప్రకటించారు. వర్చువల్ విధానంలో డిబేట్‌ను నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలను పంపించారు. వర్చువల్ విధానంలో డిబేట్‌లో పాల్గొనడానికి ట్రంప్ అంగీకరించట్లేదు. దీనివల్ల సమయం వృధా అవుతుందే తప్ప మరో ఉపయోగం లేదని తేల్చేశారు. ట్రంప్‌నకు కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఈ డిబేట్ ఉంటుందా? లేదా? అనేది అనుమానమే.

English summary
US President Donald Trump has tested negative for the Covid-19 virus "on consecutive days", a White House physician announced on Monday (local time), ahead of his campaign rally in Florida. "In response to your inquiry regarding the President's most recent COVID-19 tests, I can share with you that he has tested NEGATIVE, on consecutive days, using the Abbott BinzaxNow antigen card," wrote Sean Conley, Physician to the US President to Press Secretary Kayleigh McEnany.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X