వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో మైక్ పెన్స్‌ను ఇబ్బంది పెట్టిన ఈగ... డిబేట్ విజేత ఎవరో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న అభ్యర్థుల మధ్య గురువారం వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా రిపబ్లిక్ అభ్యర్థి మైక్ పెన్స్ మరియు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ల మధ్య డిబేట్ తారా స్థాయికి చేరింది. వీరిద్దరి మధ్య డిబేట్ హాట్‌ హాట్‌గా నడుస్తున్న సమయంలో మైక్ పెన్స్‌ పై ఇంటర్నెట్‌లో జోకులు పేలాయి. సీరియస్‌గా పెన్స్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఈగ ఆయన తలపై వాలింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో జోకులు పుంజుకున్నాయి.

పెన్స్ ప్రసంగం సమయంలోనే..

సరిగ్గా పెన్స్ ప్రసంగిస్తున్న సమయంలో ఆ ఈగ ఆయన తలపై వాలి రెండు నిమిషాల పాటు ముప్పు తిప్పలు పెట్టింది. అయితే చర్చకు హాజరైన వారందరి దృష్టి పెన్స్ ప్రసంగం నుంచి ఈగ వైపు మరలిందంటూ ట్విటర్ వేదికగా జోక్స్ పేలాయి. తెల్ల వ్యక్తిపై నేనొక నల్ల ఈగను అంటూ నెటిజెన్లు ట్వీట్ చేశారు. ఇక ఈ ఈగ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.. ఒకేసారి ట్విటర్‌లో మైక్ పెన్స్ పేరు పక్కన ఫ్లై అనే పదం కూడా ప్రత్యక్షమైంది

డిబేట్ విన్నర్ ఈగ

ఇక మరో నెటిజెన్ ఒక అడుగు ముందుకు వేసి ఈ డిబేట్‌లో విజేత కచ్చితంగా మైక్ పెన్స్‌పై వాలిన ఈగనే అంటూ ట్వీట్ చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఆమె ట్వీట్ చేసింది. ఇక కొందరైతే మైక్ పెన్స్ తలపై ఉన్న ఈగ ఫోటోను ఏకంగా ప్రొఫైల్ ఫోటోగా పెట్టి ఓ సరికొత్త ట్విటర్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఇంకొందరు మైక్ పెన్స్‌పై తలపై ఆ ఈగ ఎంతసేపు ఉందో సమయం లెక్కించి మరీ ట్వీట్ చేశారు. ఇంట్లో తిరిగే ఈగలు 28 రోజులు బతుకుతాయని అంటే ఈగ మైక్ పెన్స్ పై వాలింది కాబట్టి తను గెలిచే అవకాశాలు తక్కువని.. ఈసారి జోబిడెన్ మరియు కమలా హ్యారిస్‌లే విజయం సాధిస్తారని మరో నెటిజెన్ ట్వీట్ చేశారు.

Recommended Video

Donald Trump : నిబంధనలకు విరుద్ధంగా Trump పోస్ట్.. నిర్మోహమాటంగా తొలగించిన Facebook || Oneindia

ఫ్లై విల్ ఓట్ డాట్ కామ్

కొందరు fly will vote dot com పేరుతో ఏకంగా ఓ వెబ్‌సైట్‌నే క్రియేట్ చేశారు. దీన్నే జోబిడెన్ తన ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. అయితే దాన్ని క్లిక్ చేస్తే మాత్రం అది నేరుగా i will vote dot comకు తీసుకెళుతుంది. అక్కడే రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ సారి ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక మైక్ పెన్స్‌పై ఈగ వాలిని ఎపిసోడ్ ముగిశాక ట్విటర్‌ పై ఫ్లై అనే పేరు ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై నెటిజెన్లు తమకు తోచినట్లుగా సెటైర్లు వేశారు. పెన్స్ గులాబీరంగు కళ్లతో అబద్ధాలు చెబితే ..నలుపు రంగులో ఉండే ఈగలు మాత్రం క్లాక్ వైస్‌ రూపంలో చక్కర్లు కొడుతాయని కొందరు ట్వీట్ చేశారు. ఈగ తలపై ఉన్నప్పటికీ పెన్స్ మాత్రం దాన్ని తరిమే ప్రయత్నం చేయలేదని చివరకు ఆఈగకే విసుకు వచ్చి తలపై నుంచి పక్కకు వెళ్లిపోయిందంటూ మరో నెటిజెన్ ట్వీట్ చేశారు.

English summary
A fly on Mike Pence's head created quite a buzz as the Republican incumbent went head to head with Democrat Kamala Harris in Utah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X