అధ్యక్ష ఎన్నికల వేళ..కలకలం: జార్జియాలో హైదరాబాదీ దారుణహత్య: కత్తిపోట్లు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముంగిట కలకలం చెలరేగింది. జార్జియాలో నివాసం ఉంటోన్న హైదరాబాదీ వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తలు ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జార్జియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల కోలాహలంలో మునిగివున్న వేళ చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

హతుడి పేరు మహ్మద్ ఆరిఫ్ మొహినుద్దీన్. వయస్సు 37 సంవత్సరాలు. భార్య మెహనాజ్ ఫాతిమా, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడలో వారు నివసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట మొహియుద్దీన్ అమెరికాకు వెళ్లారు. జీవనోపాధి కోసం మొహియుద్దీన్ జార్జియాలో సూపర్ మార్కెట్‌ను నడుపుతున్నారు. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

US election 2020: hyderabadi man Mohammed Arif Mohiuddin stabbed to death in Georgia

ఈ విషయాన్ని జార్జియా పోలీసులు మొహియుద్దీన్ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అత్యవసర విసాపై అమెరికా వెళ్లడానికి అనుమతి ఇచ్చేలా చర్యలను తీసుకోవాలని మెహనాజ్ ఫాతిమా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకూ వినతిపత్రాన్ని పంపించారు. చివరిచూపును చూడటానికి వీలు కల్పించాలని ప్రాధేయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్ ఆమె కుటుంబానికి అండగా నిలిచారు.

మొహియుద్దీన్ ఫొటో, పాస్‌పోర్ట్, ఇతర వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాన్ని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని అమెరికా ఏంబసీకి ట్యాగ్ చేశారు. జార్జియా ఆసుపత్రిలో అనాథగా తన భర్త మృతదేహం ఉందని మెహనాజ్ ఫాతిమా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, అమెరికా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+