వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వలింగ సంపర్కుల ఓటు బ్యాంకునకు బిడెన్ గాలం: గే, లెస్బియన్ల కోసం వందరోజుల్లో కొత్త చట్టం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం పోలింగ్ ప్రారంభం కానుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అమెరికన్లు సన్నద్ధమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ వరుసగా రెండోసారి విజయం సాధిస్తారా? లేదా? అనేది తేలిపోనుంది.

రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ ముందు నిర్వహించిన సర్వేలన్నీ జో బిడెన్ వైపే మొగ్గ చూపాయి. అదంతా మీడియా మాయగా.. వాస్తవ పరిస్థితులు ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరో అడుగు ముందుకేసిన బిడెన్..

మరో అడుగు ముందుకేసిన బిడెన్..

ఈ పరిణామాల మధ్య జో బిడెన్ మరో కీలక అడుగు ముందుకేశారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఓటుబ్యాంకును ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లెస్బియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఆయన కొత్త హామీలను కురిపించారు. తాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈక్వాలిటీ బిల్‌ను ప్రవేశపెడతానని జో బిడెన్ హామీ ఇచ్చారు. వారికి సర్వహక్కులనూ కల్పిస్తానని చెప్పారు. అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కోసం పౌరహక్కుల చట్టంపై సంతకం చేస్తానని అన్నారు.

ఈక్వాలిటీ చట్టం అంటే..

ఈక్వాలిటీ చట్టం అంటే..

అమెరికాలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ భారీగా ఉంటోంది. స్వలింగ సంపర్కులతో కూడిన అసోసియేషన్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. స్వలింగ సంపర్కులను అక్కడి సమాజం చులకనగా చూస్తోందనే ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. సమాన హక్కు ఉండట్లేదని, జెండర్ ఐడెంటిటీని కోల్పోతున్నామనే భావన ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో వ్యక్తమౌతోంది. 1964 పౌర హక్కుల చట్టంలో సవరణలు చేసినప్పటికీ.. దాని వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని చెబుతుంటారు.

ఇదివరకే చట్టం కోసం చర్యలు..

ఇదివరకే చట్టం కోసం చర్యలు..

లెస్పియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్ల కోసం జో బిడెన్ ఇదివరకే ఈక్వాలిటీ చట్టం కోసం ప్రయత్నించారు. 2009 నుంచి 2017 మధ్యకాలంలో బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన స్వలింగ సంపర్కుల కోసం కొన్ని చర్యలను తీసుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వం మారిపోవడంతో వాటికి బ్రేక్ పడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తాను అధికారంలోకి వస్తే.. ఈక్వాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తానంటూ తాజాగా జో బిడెన్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు ఆయన ఫిలడెల్ఫియా గే న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు.

 అమెరికా జనాభాలో 10 నుంచి 15 శాతం వరకు

అమెరికా జనాభాలో 10 నుంచి 15 శాతం వరకు

అమెరికా జనాభాలో సుమారు 10 వరకు స్వలింగ సంపర్కులు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఉంది. ప్రత్యేకంగా అసోసియేషన్లు వెలిశాయి. 2017 నాటికి వారి జనాభా 8 శాతం వరకు ఉండగా.. ఈ మూడేళ్ల కాలంలో మరింత పెరిగి ఉండొచ్చని 10 నుంచి 12 శాతానికి చేరుకుని ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో వారి ఓటుబ్యాంకు కొద్దో గొప్పో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Democratic presidential candidate Joe Biden has vowed to sign the Equality Act into law within 100 days of taking office should he win United States presidential election 2020. The LGBTQ community is rooting for the Democratic presidential candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X