అమెరికా చట్టసభల చరిత్రలో అరుదుగా: ఆ సీన్ రిపీట్: 80 ఏళ్ల లేటు వయస్సులో: ట్రంప్ పార్టీ మళ్లీ
వాషింగ్టన్: అమెరికా చట్టసభల చరిత్రలో అత్యంత అరుదైన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్‌గా న్యాన్సీ పెలోసీ మళ్లీ ఎన్నికయ్యారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు కావడం, స్పీకర్‌గా మళ్లీ ఎన్నిక కావడం అరుదుగా భావిస్తున్నారు. అమెరికా 117వ కాంగ్రెస్‌కు న్యాన్సీ పెలోసీ మళ్లీ ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీకి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ల అభ్యర్థి కెవిన్ మెక్‌క్యార్థీని ఓడించారు. జాతిపిత మహాత్మాగాంధీ ఫాలోవర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది.
ఈ ఎన్నికల్లో న్యాన్సీ పెలోసీకి 216 ఓట్లు పోల్ అయ్యాయి. కెవిన్ మెక్‌క్యార్థీకి 209 ఓట్లు పడ్డాయి. చివరి వరకు ఉత్కంఠభరితంగా ఈ ఎన్నికలు సాగాయి. ఒకదశలో కెవిన్ పైచేయిని సాధించినప్పటికీ.. చివర్లో వరుసగా న్యాన్సీకి ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో కెవిన్.. 209 వద్దే ఆగిపోవాల్సి వచ్చింది. ఏడు ఓట్ల స్వల్ప తేడాతో న్యాన్సీ మరోసారి స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. మొత్తం 427 మంది హౌస్ రెప్రజెంటేటివ్స్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పదవి కోసం పోటీ చేసిన ట్యామీ డక్‌వర్త్, హకీమ్ జెఫ్రీస్‌కు ఒక్కో ఓటు పోల్ అయినట్లు హౌస్ క్లర్క్ తెలిపింది.

హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో డెమొక్రటిక్ పార్టీకి 222, రిపబ్లికన్లకు 209 మంది సభ్యుల బలం ఉంది. ఆరు మంది డెమొక్రాట్లు ఈ ఓటింగ్‌లో పాల్గొనకపోవడం ఉత్కంఠతకు దారి తీసింది. 222 మంది సభ్యులు ఉన్న డెమొక్రాట్లే స్పీకర్ పదవిని చేజిక్కించుకుంటారనే అభిప్రాయాలు ముందు నుంచీ వ్యక్తమైనప్పటికీ.. సభ్యులు డుమ్మా కొట్టడంతో ఉత్కంఠత నెలకొంది. పెద్ద సంఖ్యలో డెమొక్రాట్లు స్పీకర్ ఎన్నికను బహిష్కరిస్తారని భావించారు. ఆ సంఖ్య ఆరుకే పరిమితమైంది. 2014 నాటి ఎన్నికతో పోల్చుకుంటే..న్యాన్సీకి ఈ సారి రెండు ఓట్లు ఎక్కువే పడ్డాయి.
1987లో ఆమె మొట్టమొదటిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ప్రతీసారి గెలుపొందుతూనే వస్తున్నారు. కాలిఫోర్నియా డిస్ట్రిక్‌కు ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2007లో మహిళ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఓ మహిళ స్పీకర్‌గా ఎన్నిక కావడం అదే తొలిసారి. 2009లో నిర్వహించిన ఎన్నికలోనూ ఆమె మళ్లీ స్పీకర్‌గా నియమితులు అయ్యారు. వృత్తిపరంగా ఆమె న్యాయవాది. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై ఆమె వాదించే వారు. స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే ఆమె భావోద్వేగంతో ప్రసంగించారు. కరోనా బారిన పడి అమెరికాలో మూడున్నర లక్షల మంది మరణించడం బాధాకరమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications