వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన లేడీ గాగా: యు అండ్ ఐతో మత్తెక్కించిన సింగర్: యూత్‌కు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించడానికి డెమొక్రటిక్ పార్టీ నేతలు సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు. పదేళ్ల పాటు తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని 2016 నాటి ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్లు కొల్లగొట్టేశారనే కసి వారిలో కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున వరుసగా రెండోసారి పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి, అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పోలింగ్ చివరి నిమిషం వరకూ పోరాడుతోంది. ఇందులో భాగంగా- అమెరికన్ టాప్ మ్యుజీషియన్, సింగర్ లేడీ గాగాను ఎన్నికల ప్రచార బరిలో దింపింది.

బిడెన్ హోమ్ స్టేట్‌లో కిక్ ఎక్కించేలా..

అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఆమె పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియాల్లో జో బిడెన్‌తో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. పెన్సిల్వేనియా.. జో బిడెన్ హోమ్ స్టేట్. అక్కడే ఆమె తన ఫైనల్ స్పీచ్ ఇచ్చారు. ర్యాలీ ఆరంభంలో తాను పాడిన సూపర్ హిట్ ట్రాక్‌లను మళ్లీ వినిపించారు. షాల్లోవ్స్, యు అండ్ ఐతో మత్తెక్కించారు. దిస్ ఈజ్ అమెరికా అనే పాటతో హోరెత్తించారు. ఆమె ఎన్నికల ప్రచార ర్యాలీ మొత్తం.. ఓ లైవ్ మ్యూజికల్ షోను తలపించింది. లేడీ గాగాతో పాటు మరో మ్యుజీషియన్ జాన్ లెడెన్‌ సైతం డెమొక్రాట్ల తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

మరో సింగర్ జాన్ లెడెన్ కూడా..

డెమొక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న కమలా హ్యారిస్ భర్తతో కలిసి జాన్ లెడన్ వేదికపై చిందులేశారు. షో ముగిసిన అనంతరం లేడీ గాగా మాట్లాడారు. ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఇంకొన్ని గంటల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లుగా అధ్వాన్నస్థితికి చేరిన అమెరికా మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోబోతోందని అన్నారు. ఈ నాలుగేళ్ల డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా సాగిందో ప్రతి ఒక్క అమెరికన్ చవి చూశారని, దీనికి తనలాంటి ప్రముఖులకు కూడా మినహాయింపేమీ లేదని అన్నారు.

కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నాం..

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే భరోసా ఇవ్వాలంటూ లేడీ గాగా విజ్ఙప్తి చేశారు. ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. నాలుగేళ్ల విలువైన కాలాన్ని డొనాల్డ్ ట్రంప్ వంటి అసమర్థుల చేతుల్లో పెట్టొద్దని ఆమె పరోక్షంగా విమర్శించారు. పెన్సిల్వేనియా సహా అన్ని రాష్ట్రాల్లోనూ జో బిడెన్ మెజారిటీని సాధిస్తున్నారంటూ వస్తోన్న వార్తలు తనను మరింత కిక్ ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. బిడెన్ సారథ్యంలో సరికొత్త అమెరికా ఆవిష్కృతమౌతుందనడంలో సందేహాలు అక్కర్లేదని, ఆ విశ్వాసం తనకు ఉందని చెప్పారు.

English summary
Musician Lady Gaga delivered a passionate speech at the Democratic party's presidential candidate Joe Biden's final campaign event at Pennsylvania. the 34-year-old musician complimented her speech along with a power-packed performance of her songs 'Shallow,' and 'You and I.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X