వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రీపోల్ సర్వేలు జో బైడెన్ వైపే, కానీ..: డొనాల్డ్ ట్రంప్ జోరు చూపిస్తున్నారు!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తదుపరి అమెరికా అధ్యక్షుడు అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పది కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ఆరు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా, మంగళవారం సాయంత్రం నుంచి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వెలువడిన ప్రీ పోల్ సర్వేలు చర్చనీయాంశంగా మారాయి.

Recommended Video

US Election 2020 : Trump - Joe Biden మధ్య టఫ్ ఫైట్.. అధ్యక్ష రేసులో ఆధిక్యం దిశగా ఆ నేత!
అత్యధిక ప్రీపోల్ సర్వేలు జో బైడెన్ వైపే..

అత్యధిక ప్రీపోల్ సర్వేలు జో బైడెన్ వైపే..

అత్యదిక ప్రీపోల్ సర్వేలు డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపే మొగ్గు చూపుతుండటం గమనార్హం. అయితే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్తి, ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని మాత్రం ఖరారు చేయలేకపోయాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు సర్వేలు తేల్చడం గమనార్హం.

ట్రంప్ కంటే జో బైడెన్ స్వల్ప ఆధిక్యం, కానీ

ట్రంప్ కంటే జో బైడెన్ స్వల్ప ఆధిక్యం, కానీ

రియల్ క్లియర్ పాలిటిక్స్ గణాంకాల ప్రకారం.. గెలుపు ఖరారు చేసే రాస్ట్రాలుగా భావిస్తున్న వాటిలో డొనాల్డ్ ట్రంప్ కంటే జో బైడెన్‌కే మొగ్గుచూపాయి. ట్రంప్ కంటే 2.9 శాతం పాయింట్లతో జో బైడెన్ ముందంజలో ఉన్నారు. సాధారణంగా ఈ ఆధిక్యాన్ని మదింపు దోషం కింద తీసేస్తుంటారు. ఈ సర్వే ప్రకారం జో బైడెన్ గెలుపును ఖాయంగా చెప్పలేకపోయింది. అయితే, జో బైడెన్ అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గత కొద్ది రోజుల్లోనే పుంజుకున్న డొనాల్డ్ ట్రంప్

గత కొద్ది రోజుల్లోనే పుంజుకున్న డొనాల్డ్ ట్రంప్

కాగా, బైడెన్ ఆధిక్యం గత కొన్ని రోజుల్లోనే భారీగా క్షీణించినట్లు సర్వేలు వెల్లడించాయి. దీనిక ట్రంప్ తోపాటు ఆయన కుటుంబసభ్యులు, ఇతర మద్దతు బృందాలు చేసిన విస్తృత పర్యటనలే కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజుల్లో ట్రంప్ స్వయంగా 15 ర్యాలీల్లో పాల్గొన్నారు. కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న ఫ్లోరిడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్‌లో ఐదు సభలు నిర్వహించారు. రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ సహా ఆయన కుటుంబసభ్యులు గత మూడు రోజుల్లో ఏకంగా 40 సభల్లో పాల్గొని ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

ప్రీ పోల్ సర్వేలు ఏమంటున్నాయంటే..?

ప్రీ పోల్ సర్వేలు ఏమంటున్నాయంటే..?

సీఎన్ఎన్/ఎస్ఎస్ఆర్ఎస్ ప్రీపోల్ సర్వే

జో బైడెన్ 54 శాతం
డొనాల్డ్ ట్రంప్ 42 శాతం

ఎన్బీసీ/డబ్ల్యూఎస్‌జే
జో బైడెన్ 52
డొనాల్డ్ ట్రంప్ 42

ఫాక్స్ న్యూస్
జో బైడెన్ 52 శాతం
డొనాల్డ్ ట్రంప్ 44 శాతం

ఐపీఎస్ఓఎస్/రూటర్స్
జో బైడెన్ 52 శాతం
డొనాల్డ్ ట్రంప్ 42

న్యూయార్క్ టైమ్స్/సియాన్నా కాలేజ్
జో బైడెన్ 50 శాతం
డొనాల్డ్ ట్రంప్ 41

English summary
According to the latest CNN poll of polls, Biden is 10 percentage points ahead of Donald Trump in national polling average. The national polling average of Joe Biden is at 52% while Donald Trump looks way behind at 42%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X