వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌పై పగ తీర్చుకున్న నల్ల జాతీయులు: నూటికి 12 మందే: ఎడిసన్ స్టడీ ఏం చెబుతోంది?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు చోటు చేసుకున్న ఒకట్రెండు వరుస ఘటనలు..డొనాల్డ్ ట్రంప్‌కు కీలక ఓటుబ్యాంకును దూరం చేశాయి. అమెరికా జనాభాలో 30 మిలియన్లకు పైగా ఉన్న నల్ల జాతీయుల కమ్యూనిటీ ఓటు బ్యాంకు మొత్తం కూడబలుక్కుని డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసింది. రెండోసారి అగ్రరాజ్యం పీఠాన్ని అధిరోహించాలనే ఆయన కలలను భగ్నం చేసే పరిస్థితికి దారి తీసేలా చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) విపరీతమైన ప్రభావాన్ని చూపినట్టయింది.

అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో..

అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో..

అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో నల్ల జాతీయులు నివసిస్తున్నారు. ఎథ్నిక్ కమ్యూనిటీగా గుర్తింపు ఉన్న ఆఫ్రికన్-అమెరికన్లు శతాబ్దాల నుంచి ఆ దేశంలో భాగం అయ్యారు. అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, ఇహోవా, మిచిగాన్, నార్త్ కరోలినా, ఓహియో, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లల్లో ఆఫ్రికన్-అమెరికన్లు మెజారిటీ సంఖ్యలో ఉంటున్నారు. వారిలో 29 శాతం మందికి ఓటు హక్కు ఉంది. 2000 సంవత్సరంలో ఓటు హక్కు ఉన్న నల్ల జాతీయుల సంఖ్య 12.5 శాతం మాత్రమే. ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య 11.5 శాతం మేర పెరిగింది.

ఆరు రాష్ట్రాల్లో కీలకంగా..

ఆరు రాష్ట్రాల్లో కీలకంగా..


ప్రత్యేకించి ఆరు రాష్ట్రాల్లో బ్లాక్ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటోంది. జార్జియా-32, నార్త్ కరోలినా-22, ఫ్లోరిడా-14, మిచిగాన్-13, ఓహియో-12, పెన్సిల్వేనియా-10 శాతం మేర ఓటు హక్కు ఉన్న నల్ల జాతీయులు నివసిస్తున్నారు. ఓటు హక్కు ఉన్న నల్ల జాతీయుల సంఖ్య 10 శాతానికి లోబడి ఉన్న రాష్ట్రాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓటుబ్యాంకే కీలకంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడమంటూ జరిగితే.. అందులో నల్ల జాతీయులు కీలక పాత్ర పోషించినట్టవుతుంది.

87 శాతం మంది బిడెన్‌కు ఓటు..

87 శాతం మంది బిడెన్‌కు ఓటు..

అధ్యక్ష ఎన్నికల్లో నల్ల జాతీయులు డెమొక్రాట్లకు అండగా నిలిచారు. 87 శాతం ఓట్లు ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌కు పడ్డాయి. 12 శాతం మాత్రమే బ్లాక్ ఓటర్లు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఎడిషన్ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్‌కు పోల్ అయిన నల్ల జాతీయుల ఓట్లు 11 నుంచి 12 శాతం లోపే ఉందని పేర్కొంది. 87 శాతం మంది బిడెన్‌ వైపు నిలిచారని, ఏ కేటగిరీకి, ఏ వర్గానికి చెందిన ఓటుబ్యాంకుతో పోల్చుకున్నా ఈ సంఖ్య చాలా అధికంగా ఉందని వెల్లడించింది. ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసిన 12 శాతం మంది బ్లాక్ ఓటర్లలో పురుషులు అధికంగా ఉన్నారని తెలిపింది. మరో రీసెర్చ్ సంస్థ ఏపీ నిర్వహించిన సర్వేలో.. 90 శాతం మేర నల్ల జాతీయులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తేలింది.

జార్జ్ ఫ్లాయిడ్ ఘటనపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు..

జార్జ్ ఫ్లాయిడ్ ఘటనపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు..

జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అమెరికాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్-అమెరికన్‌‌పై మిన్నెసొటా పోలీసులు వ్యవహరించిన తీరు అప్పట్లో ప్రకంపనలను పుట్టించింది. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై మోకాలిని అదిమి పెట్టిన ఘటనలో ఊపిరి ఆడకుండా అతను మరణించాడు. ఈ ఘటనపై ఇప్పటికే వ్యతిరేకత చెలరేగుతూనే ఉంది. అదే సమయంలో లూసియానాలో కూడా పోలీసులు ఓ ఆఫ్రికన్-అమెరికన్‌పై కాల్పులు జరిపారు. ఇవన్నీ బ్లాక్ ఓటర్లలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ట్రంప్‌ ప్రభుత్వంపై ఉన్న పగను వారు ఈ రకంగా తీర్చుకున్నట్టయింది.

English summary
Black voters made up about 11 or 12 percent of the electorate, according to the Edison research. Edison Research determined that 87 percent of Black voters voted for Biden and 12 percent for Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X