ట్రంప్‌కు గట్టి షాక్: మరోసారి అమెరికా షట్ డౌన్.., కొత్త బిల్లుకు చిక్కులు!

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా పాలనా వ్యవస్థ మరోసారి స్తంభించిపోనుంది. కీలకమైన ద్రవ్యపరపతి బిల్లుకు సెనేట్ ఆమోదం దక్కకపోవడంతో గడిచిన మూడోవారాల్లో రెండోసారి ప్రభుత్వం స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యకలాపాలకు అవకాశం లేకపోవడంతో కార్యాలయాలను మూసివేయనున్నారు.

అర్థరాత్రి నుంచి..:

అర్థరాత్రి నుంచి..:

ఫెడరల్ ఫండింగ్ బిల్లు శుక్రవారం అర్థరాత్రితో ముగిసిపోయింది. దీని స్థానంలో కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఇందుకోసం సేనేట్‌ సహా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త బిల్లుకు ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఈ రెండూ ట్రంప్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నా.. షట్ డౌన్ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం.

హౌజ్ కాంగ్రెస్ విఫలం:

హౌజ్ కాంగ్రెస్ విఫలం:

ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత అర్థరాత్రితో ముగిసిపోవడంతో శుక్రవారం అర్థరాత్రి నాటికి కొత్త బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే బిల్లుకు ఆమోదం తీసుకురావడంలో హౌజ్ కాంగ్రెస్ పూర్తిగా విఫలమవడంతో.. ఇక షట్ డౌన్‌కు సిద్దంగా ఉండాలంటూ ప్రభుత్వ సీనియర్ సలహాదారు ఒకరు వైట్ హౌజ్ సిబ్బందికి సంకేతాలు పంపించారు.

ఇమ్మిగ్రేషన్ ఇష్యూ..:

ఇమ్మిగ్రేషన్ ఇష్యూ..:

ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న సుమారు 7లక్షల మంది అక్రమ వలసదారులను ప్రభుత్వం దేశం నుంచి పంపించాలని యోచిస్తోంది. డెమోక్రాట్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వలసదారుల్ని కట్టడి చేయడం కోసం అమెరికా ప్రభుత్వం తాజా బిల్లులో భారీ నిధులు కేటాయించింది. అదే సమయంలో వలసదారుల గురించి మాత్రం అందులో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో బిల్లుకు ఆమోదం తెలపడానికి డెమోక్రాట్ల నుంచి మద్దతు కరువైంది.

వ్యతిరేకించిన పాల్..:

వ్యతిరేకించిన పాల్..:

తాజా బిల్లుపై రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ కూడా పెదవి విరిచారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన పాల్.. సవరణల్ని ప్రతిపాదిస్తూ ఓటింగ్ జరపాలని పాల్ పట్టుబట్టారు. రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరపడాన్ని ఆయన తప్పుపడుతున్నారు.

ఏకాభిప్రాయం కుదరక..:

ఏకాభిప్రాయం కుదరక..:

గడిచిన నెల రోజుల్లో అమెరికా కార్యకలాపాలు రెండోసారి స్థంభించిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటిసారి షట్ డౌన్ పరిస్థితి వచ్చినప్పుడు 'ఇమ్మిగ్రేషన్' విషయమే ప్రధాన కారణంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The US government has officially shut down for the second time this year because Congress failed to meet a deadline to vote on a new budget.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి