అమెరికా పాఠ్యాంశాల్లో హిందుత్వం: ఇండియన్ల విజయం

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలోని పాఠ్యాంశాల్లో ఇండియా, హిందూమతం గురించి ఖచ్చితమైన, శాస్త్రీయంగా ఉండాలని పదేళ్ళుగా చేస్తున్న పోరాటానికి విజయం లభించింది. హిందుత్వం, భారతదేశం గురించి అమెరికా పాఠ్యాంశాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కాలిఫోర్నియా ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌, స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌బీఈ) అంగీకారం తెలిపింది.

రెండు పాఠ్యాంశాల పద్దతిని సైతం కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తిరస్కరించింది. గ్రేడ్స్‌ కే6-గ్రేడ్స్‌ 6-8 వరకూ అన్ని పాఠ్యాంశాల్లోనూ హిందువులు, భారత దేశ చరిత్రను సమగ్రంగా అందించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

US Hindus claim victory in California legal case on textbooks

కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అమెరికా హిందూ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు శాంతారామ్‌ అన్నారు.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ నాగరికత, హిందుత్వం గురించిన నిజానిజాలు అమెరికన్లకు తెలుస్తాయని ఆయన అన్నారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hindu American groups on Saturday said they have won a “significant victory” in California state, as education officials acceded to their over decade-long efforts for an “accurate, equitable, and culturally competent portrayal” of Hinduism and India in school textbooks.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి