అమెరికా నుంచి తరిమేయడానికి మరో 7 వేల మంది భారతీయుల గుర్తింపు..!
అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా భారత్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి సుదీర్ఘ కాలంగా అమెరికాలో పాతుకుపోయిన అక్రమ వలసదారుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ట్రంప్ తీసుకొచ్చిన తాజా ఇమ్మిగ్రేషన్ విధానంపై విచారణ జరుపుతున్న హౌస్ కమిటీ ఇవాళ మరికొందరు భారతీయ అక్రమ వలసదారుల్ని గుర్తించింది. దీంతో వీరి మెడపై కత్తి వేలాడుతోంది.
అమెరికా హౌస్ కమిటీ విచారణలో పాల్గొన్న సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ నిపుణురాలు జెస్సికా ఎం వాఘన్ 2023లో భారత్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు 7 వేలుగా తేలినట్లు వెల్లడించారు. వీరంతా విద్యార్ధులు, ఎక్సేంజ్ విజిటర్లే అన్నారు. వీరంతా తమ వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉండిపోయినట్లు కమిటీకి తెలిపారు. వీరిని గుర్తించి వెనక్కి తరిమేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. దీంతో వీరి విషయంలో అమెరికా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు కీలకంగా మారాయి.

అమెరికాలో కనీసం 32 దేశాలకు చెందిన అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు తేలింది. వీరిలో భారతీయలు కూడా ఉన్నారు. అలాగే వీరంతా రెండు రకాల వీసాలు ఎఫ్ 1, ఎం 1 వీసాలతో వచ్చి పాతుకుపోయారు. వీటి గడువు తీరినా వీరు అమెరికాను వీడటం లేదు. ఇందులో ఎఫ్ 1 వీసాల్ని అక్కడి స్కూల్లు, కాలేజీలు, వర్శిటీల్లో రెగ్యులర్ స్టూడెంట్స్ గా చదువుకునేందుకు ఇస్తారు. అలాగే ఎం1 వీసాల్ని వృత్తివిద్యా కోర్సులు, నాన్ అకడమిక్ అవసరాలు, భాషా నైపుణ్యాలు అభ్యసించే వారికి ఇస్తారు.
ఇలా వచ్చిన వారే ఇప్పుడు అక్కడ పాతుకుపోయారు. వీరిలో 7 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిని తక్షణం గుర్తించి చర్యలు తీసుకునేలా చట్టాల్ని సవరించాలని జెస్సికా కోరారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోనుంది.












Click it and Unblock the Notifications