వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు అతిపెద్ద సంక్షోభాలు: జనవరి నుంచి అదే పని: జో బిడెన్ కొత్త టాస్క్: నో టైమ్ టు వేస్ట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచం మొత్తం 2020లో ఎలాంటి పెను సంక్షోభాలను చవి చూస్తూ వస్తోందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. కరోనా మహమ్మారి బారిన పడని దేశం అంటూ ఏదీ లేదు. చివరికి- అంటార్కిటికాకూ పాకింది. కోట్లాది మంది దీని పాలిట పడ్డారు. 17.50 లక్షల మందికి పైగా మరణించారు. అనేక దేశాలు రోజుల తరబడి లాక్‌డౌన్‌లో గడపాల్సి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఒకవంక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ను సడలించుకోవాల్సి వచ్చింది. కరోనా వైరస్ మధ్యే జీవించాల్సి వస్తోంది.

అగ్రరాజ్యం అమెరికా కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఆ మాటకొస్తే.. కరోనా వైరస్ బారిన పడి అత్యధికంగా ప్రాణనష్టాలను చవి చూసింది ఈ దేశమే. అమెరికాలో 3,41,138 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. 1,95,73,846 కేసులు అక్కడ నమోదు అయ్యాయి. కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. ఆధునిక అమెరికా చరిత్రలో పెను సంక్షోభంగా దీన్ని అభివర్ణించారు. ఒక్క ఏడాదిలోనే తమ దేశంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

 US is facing four historic crises at once, there will be no time to waste: Joe Biden

ఈ ఒక్క ఏడాదిలోనే నాలుగు అతిపెద్ద సంక్షోభాలను చవి చూశామని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, నల్ల జాతీయులపై దాడులు.. 365 రోజుల్లో ఈ సంక్షోభ పరిస్థితులు దేశం ఎదుర్కొందని, మున్ముందు.. దాని ప్రభావం కొనసాగే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు వాటి దుష్ప్రభవాలు కనిపించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. కొత్త ఏడాది ఆరంభం నుంచి ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయనివ్వని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జనవరం నుంచి సమయాన్ని వృధా చేయకుండా సంక్షోభాలను అధిగమించడంపైనే దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు.

దేశాన్ని కూకటి వేళ్లతో సహా కదిలించి వేసిన ఆ సంక్షోభాలను రూపుమాపడానికి ప్రతి అమెరికన్ చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రతి పౌరుడు తన బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు. దేశాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేసుకోవడానికి అవసరమైనన్ని చర్యలను కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంక్షోభాల కాలాన్ని అదిగమించగలమనే ఆత్మవిశ్వాసం తనకు ఉందని చెప్పారు. దేశాన్ని మళ్లీ అగ్రరాజ్యంగా నిలిపే బాధ్యత ప్రభుత్వంతో పాటు పౌరులపైనా ఉందని గుర్తు చేశారు.

English summary
US President-elect Joe Biden said that from COVID-19 and the economy to climate change and racial justice our nation is facing four historic crises at once. And come January, there will be no time to waste, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X