
‘మాజీ గర్ల్ ఫ్రెండ్ శాపాన్ని తొలగించలేకపోయిన’ భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా వేసిన అమెరికా వ్యక్తి

తన వివాహాన్ని నిలబెడతానని మాటిచ్చిన భూతవైద్యురాలి (సైకిక్)పై కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి దావా వేశారు. తన మాజీ ప్రియురాలు మరో మంత్రగత్తె సహాయంతో పెట్టిన శాపాన్ని తొలిగిస్తానని సదరు సైకిక్ తనకు చెప్పినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నారు.
సోఫియా ఆడమ్స్ అనే భూత వైద్యురాలు, 5100 డాలర్లు (రూ. 3.8 లక్షలు) చెల్లిస్తే శాపాన్ని తొలిగించి తన వివాహ బంధం తెగిపోకుండా కాపాడతానని మాటిచ్చిందని మౌరో రెస్ట్రెపొ చెప్పారు. టోరెన్స్ సుపీరియర్ కోర్టులో మౌరో ఈ మోసానికి సంబంధించిన కేసును దాఖలు చేశారు.
సోఫియాపై నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం, పౌర కుట్ర, భావోద్వేగాలతో ఆడుకోవడం అనే అభియోగాల కింద కేసును నమోదు చేశారు.
''శాపాన్ని తొలిగించకపోతే తన కుటుంబం ప్రమాదంలో పడుతుందని, సంతోషంగా ఉండలేమని'' సోఫియా చెప్పిందని మౌరో వెల్లడించారు.
ప్రస్తుతం మౌరో 25,000 డాలర్ల (రూ. 18.6 లక్షలు) నష్టపరిహారాన్ని కోరుతున్నారు.
గూగుల్‌లో 'సైకిక్'ల గురించి వెతికిన తర్వాత సోఫియాను కలిశానని మౌరో చెప్పారు.
సోఫియాకు చెందిన వెబ్‌సైట్, ఆమెను 'సైకిక్ లవ్ స్పెషలిస్ట్'తో పాటు 'పీహెచ్‌డీ లైఫ్ కోచ్'గా పేర్కొంది.
''అందువల్లే నాకు సహాయం చేయగలిగే ఒక ప్రొఫెషనల్‌తో మాట్లాడుతున్నానని నేను నమ్మాను'' అని మౌరో అభియోగంలో పేర్కొన్నారు.
''సెషన్ల సందర్భంగా సోఫియా, మౌరో టారో కార్డులు చదివారు. ఆయనను దురదృష్టం వెంటాడుతున్నట్లుగా చెప్పారు. మౌరో మాజీ ప్రియురాలు, ఒక మంత్రగత్తెతో శాపం పెట్టించిందని... దాన్ని తొలిగించకపోతే మౌరోతో పాటు ఆయన భార్య, పిల్లలు, వివాహ బంధం నాశనమవుతుందని సోఫియా చెప్పినట్లు'' కోర్టు పత్రాల ద్వారా తెలిసింది.
మొదటి విడతగా 1000 డాలర్లు (రూ. 74, 780) చెల్లించినప్పటికీ సోఫియా నుంచి తనకు ఎలాంటి సహాయం లభించలేదని మౌరో పేర్కొన్నారు. తన కుటుంబం నిద్రలేని రాత్రులు గడుపుతోందని... ఆందోళన, వేదన అలాగే కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ దావాలో సోఫియా భర్త, కూతురుతో పాటు ఆమె ఇంటి యజమానిని కూడా చేర్చారు.
ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- ఎయిర్ ఇండియా విమానం వంతెన కింద ఎలా ఇరుక్కుపోయింది?
- ఆంధ్రప్రదేశ్: సాయి ధరమ్‌తేజ్ రిపబ్లిక్ చిత్రంపై 'కొల్లేరు ప్రజల ఆగ్రహం’
- సూర్యుడి రంగు పసుపు కాకపోతే... మరేంటి?
- 'ప్రాణాలు కాపాడితే రూ.5 వేలు ఇస్తాం'
- వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)