హెలికాప్టర్‌ను తాడుతో కట్టి మరో హెలికాప్టర్‌తో తరలింపు(వీడియో)

Subscribe to Oneindia Telugu

టోక్యో: రోడ్డుపై సాంకేతిక లోపాల కారణంగా చెడిపోయిన వాహనాలను ఇతర వాహనాలతో లాగించేయడం మనం చూస్తేనే ఉంటాం. కానీ, ఇక్కడ ఏకంగా ఓ హెలికాప్టర్‌ను మరో భారీ హెలికాప్టర్ సాయంతో తరలింంచారు.

ఈ ఘటన జపాన్‌లోని ఒఖినావా ప్రాంతంలో చోటుచేసుకుంది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఓ హెలికాప్టర్‌ సముద్రం సమీపంలో ల్యాండైంది. దాన్ని బాగుచేసేందుకు అమెరికా తీర ప్రాంత దళాలు మరో పెద్ద హెలికాప్టర్‌ను రంగంలోకి దించాయి.

హెలికాప్టర్‌ కింద స్టాండ్‌కి పాడైపోయిన హెలికాప్టర్‌ను తాడుతో కట్టి తరలించారు. ఈ అరుదైన దృశ్యాన్ని అధికారులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US Marines have rescued one of their helicopters after it made an emergency landing on a beach in Okinawa, Japan. The aircraft was airlifted back to base using an even bigger helicopter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X