వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్: ఉ.కొరియాపై అణుదాడిని అడ్డుకొంటా: హైటెన్ సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశంలోనే వ్యతిరేకత ప్రారంభమైంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశంలోనే వ్యతిరేకత ప్రారంభమైంది. ఉత్తరకొరియాపై ఏకపక్షంగా అణుదాడికి ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తే ఆ దాడిని అడ్డుకొంటానని అమెరికా అణుశక్తి కమాండర్‌ జాన్‌ హైటెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ రెండు మాసాల క్రితం వరకు అణు పరీక్షలు, క్షిపణీ పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి ఆదేశాలను కూడ కిమ్ జంగ్ ఉన్ లెక్కచేయలేదు.

అయితే ఉత్తరకొరియాను కట్టడి చేయాలంటే యుద్దం చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని అమెరికా అభిప్రాయపడింది. అయితే ట్రంప్‌ను కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లెక్క చేయలేదు.

ట్రంప్ ఆసియా దేశాల పర్యటనను పురస్కరించుకొని దక్షిణ కొరియా వేదికగా చేసుకొని ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌ ఉన్‌ను తీవ్రంగానే హెచ్చరించారు.

 ఉ.కొరియాపై అణుదాడిని అడ్డుకొంటాం

ఉ.కొరియాపై అణుదాడిని అడ్డుకొంటాం

ఉత్తరకొరియాపై అణు దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తే అడ్డుకొంటానని అమెరికా అణుశక్తి కమాండర్‌ జాన్‌ హైటెన్‌చెప్పారు.అణుదాడి చేయడానికి ముందు అనేక విషయాలపై ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని హైటెన్ అభిప్రాయపడ్డారు.కెనడాలోని నోవా స్కోటియాలో హలీఫాక్స్‌ అంతర్జాతీయ భద్రతా ఫోరంలో హైటెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

 ట్రంప్‌కు సూచనలిస్తా

ట్రంప్‌కు సూచనలిస్తా

అణు దాడి చేయాలంటే స్ట్రాట్‌కామ్‌కు కమాండర్‌ అయిన తాను తొలుత అధ్యక్షుడికి సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని హైటెన్ చెప్పారు. మేమేం పిచ్చివాళ్లం కాదు. ఎలా పడితే అలా అణు ఆయుధాలను వినియోగించబోమని హైటెన్ అభిప్రాయపడ్డారు.అయితే ఒక నిర్ణయం తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

 నిబంధనలకు విరుద్దంగా వెళ్ళబోను

నిబంధనలకు విరుద్దంగా వెళ్ళబోను

అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. అయితే నిబంధనల మేరకే తాను పనిచేస్తానని హైటెన్ చెప్పారు. నిబంధలనకు విరుద్దంగా తాను పనిచేయబోనని హైటెన్ చెప్పారు. అంటే ఉత్తరకొరియాపై నిబంధనలకు విరుద్దంగా దాడి చేయాలని ట్రంప్ ఆదేశించినా తాను అణుదాడి చేయబోనని హైటెన్ ప్రకటించారు.

 ట్రంప్‌కు ఇబ్బందేనా

ట్రంప్‌కు ఇబ్బందేనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హైటెన్ వ్యాఖ్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఉత్తరకొరియాకు ప్రయోజనం కల్గించేలా ఉన్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ తరుణంలో ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా ఉత్తరకొరియాపై అమెరికా అణుదాడికి దిగాలని భావిస్తే ఆ దాడికి అధికారులు సహకరించే అవకాశం ఉండకపోవచ్చని హైటెన్ వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమౌతోంది. అయితే ఈ సమయంలో కిమ్ వైపు నుండి దాడులు జరిగితే మాత్రం అమెరికా చూస్తూ ఊరుకొనే అవకాశం ఉండకపోవచ్చని రక్షణ శాఖ నిపుణులు అంచనాకు వచ్చారు.

English summary
The top US nuclear commander said on Saturday that he would resist President Donald Trump if he ordered an "illegal" launch of nuclear weapons.Air Force General John Hyten, commander of the US Strategic Command (STRATCOM), told an audience at the Halifax International Security Forum in Nova Scotia, Canada that he had given a lot of thought to what he would say if he received such an order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X