వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యం.. 82ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఓ తల్లి, కూతురు 82 ఏళ్ల తర్వాత కలిసిన అరుదైన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వారిద్దరూ ఎనభై రెండేళ్ల తర్వాత కలుసుకోవడం గమనార్హం. ఇది అరుదైన వాటిల్లో అరుదైన సంఘటనగా చెప్పవచ్చు.

నోనాజెనేరియన్ లీనా పీర్స్ తన కూతురు బెట్టీ మోరెల్‌ను గత నెలలో న్యూయార్క్‌లోని బింగమ్టన్‌లో గల గ్రేటర్ బింగమ్టన్ విమానాశ్రయం లాబీలో కలుసుకుంది.

పీర్స్ ఇప్పుడు తల్లి, అమ్మమ్మ అంతేకాదు.. ఓ అమ్మమ్మకు కూడా తల్లి. ఆమెకు 1933లో బెట్టీ మోరెల్ జన్మించింది. అప్పుడు కూతురు బెట్టీ వయస్సు 6 నెలలు. పీర్స్ తల్లి అయ్యే సమయానికి పద్నాగులు ఏళ్లు మాత్రమే ఉంది.

US: OMG! Mother, daughter meet after a gap of 82 years in a rare reunion

అంటే పద్నాలుగేళ్ల వయస్సులో ఆమె బెట్టీకి జన్మను ఇచ్చింది. యుటికా ఆసుపత్రిలో ఆమె జన్మను ఇచ్చింది. లీనా పీర్స్‌కు అప్పుడు పద్నాలుగేళ్ల వయస్సే కావడంతో బలవంతంగా ఆ కూతురును ఇతరులకు ఇవ్వవలసి వచ్చింది.

ఇప్పుడు లీనా పీర్స్ కూతురు బెట్టీ మోరెలన్‌ను కలుసుకుంది. దీనిపై లీనా పీర్స్ మాట్లాడుతూ... ఇది ఊహించనిదని, నమ్మలేకపోతున్నానని చెప్పింది. మరో విషయం ఏమంటే బెట్టీ మోరెల్‌ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు.. ఆమెకు 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చనిపోయారు. దీంతో బెట్టీ న్యూయార్కులోని లాంగ్ ఐస్‌లాండులో జీవిస్తోంది.

English summary
In a rare and extraordinary reunion, a woman in her late 90s met her daughter after a long gap of 82 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X