అమెరికాలో ఎప్పుడేం జరుగుతుందో..?

ఇజ్రాయెల్‌- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 10 రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టింది. ఇరాన్ లోని మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్‌ అణు స్థావరాలు- ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది.

US on high alert after airstrikes on Iran

ఈ వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైమానిక బలగాలు టేకాఫ్ తీసుకోవడం మొదలుకుని.. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించడం, ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై శక్తిమంతమైన బాంబులను జారవిడవడం, మళ్లీ స్వదేశానికి తిరుగుముఖం పట్టేంత వరకూ పిన్ టు పిన్ ఆయన పర్యవేక్షించారు.

అదే సమయంలో ఇరాన్.. దాని మిత్ర దేశాల నుంచి ప్రతిదాడుల సంభవించే అవకాశాలను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొట్టిపారేయట్లేదు. దీనితో అన్ని ప్రధాన నగరాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. రాజధాని వాషింగ్టన్ సహా న్యూయార్క్, మిన్నేసొటా, మిచిగాన్, చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిలిస్, డెన్వర్, కొలరాడో వంటి నగరాల్లో పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్దమైంది.

ఫెడరల్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటోన్నామని, ఎఫ్బీఐ నుంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోన్నామని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. జనావాసాలు, పర్యాటక కేంద్రాలు, భారీ మాల్స్ వంటి ప్రదేశాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేస్తోన్నట్లు వివరించింది.

ఇప్పటివరకు ఎటువంటి థ్రెట్స్ అందలేదని, అయినప్పటికీ- సమస్యాత్మక, సున్నిత ప్రదేశాలు, మతపరమైన ప్రాంతాల చుట్టూ పోలీసుల పహారా పెంచినట్లు ఎంపీడీ వివరించింది. అటు లాస్ ఏంజిల్స్ లో కూడా ఇవే తరహా వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

ఇరాన్ పై సైనిక చర్య తర్వాత ప్రజా భద్రతకు సంబంధించి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నట్లు లాస్ ఏంజిలిస్ మేయర్ కరెన్ బాస్ వెల్లడించారు. శాంతిభద్రతలను నిశితంగా పర్యవేక్షిస్తోన్నామని అన్నారు. ప్రార్థనా స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాల వద్ద గస్తీ ముమ్మరం చేశామని అన్నారు.

అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో పలు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థలు తమ దారిని మళ్లించుకున్నాయి. మెజారిటీ విమానయాన సంస్థలు మధ్య- తూర్పు దేశాల గగనతలాన్ని వినియోగించుకోవట్లేదని ఫ్లైట్‌ రాడార్ 24 ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. ఇరాన్, ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్ మీదుగా వాణిజ్య విమాన రాకపోకలు దాదాపు లేవని ఫ్లైట్ ట్రాకింగ్ డేటా స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+