వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, నవాజ్ షరీఫ్ లకు ఒబామా ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

కరాచీ: అమెరికా పర్యటకు మీరు రావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించారు. 2016 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదిన వాషింగ్టన్ లో జరిగే అణుభద్రతా సదస్సులో పాల్గోనాల్సిందిగా ఒబామా కోరారు.

పాక్ పత్రిక ఈ వివరాలను మంగళవారం వెల్లడించింది. 2016 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదిన అణుభద్రత నాలుగో సదస్సు నిర్వహించనున్నామని గత సదస్సులోనే బరాక్ ఒబామా ప్రకటన చేశారు. వాషింగ్టన్ సదస్సులో నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ కలుసుకుంటారని ఇటీవల వార్తలు వచ్చాయి.

US President Barack Obama invites PM Narendra Modi and Nawaz Sharif

ఇటీవల నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు వేడుకలు, ఆయన మనుమరాలి పెళ్లి సందర్బంగా నరేంద్ర మోడీ పాక్ లో ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. నవాజ్ షరీఫ్ ఇచ్చిన విందు స్వీకరించి ఆయనకు శుభా కాంక్షలు తెలిపారు.

ఇప్పుడు వాషింగ్టన్ లో జరిగే సమావేశంలో ఇరు దేశాల ప్రధానులు మళ్లీ కలుసుకోనున్నారు. ఇదే జరిగితే భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడుతాయని ఇరు దేశాల నాయకులు, ప్రజలు అంటున్నారు. మొత్తం మీద మళ్లీ దాయాది దేశాల ప్రధానులు కలవడానికి అమెరికాలో వేదిక సిద్దం అయ్యింది.

English summary
US President Barack Obama has invited both prime ministers for the Nuclear Security Summit on March 31 and April 1, 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X