మోడీకి ట్రంప్‌ షాక్: ఆ 21 దేశాల జాబితాల్లో ఇండియాను చేర్చిన అమెరికా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు షాకిచ్చారు. ఇందియాను అక్రమంగా మత్తుపదార్ధాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో చేర్చారు. ప్రపంచంలోని 21 దేశాల్లో మత్తుపదార్ధాలు ఉత్పత్తి చేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు.

మత్తు పదార్థాలు ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ కూడ ఉన్నాయి. ఈ రెండు దేశాల్లోనే అత్యధికంగా మత్తు పదార్ధాలు ఉత్పత్తి అవుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు.

భారత్‌తో పోలిస్తే మిగిలిన దేశాలు అత్యధికంగా డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. బహమాస్, బెలిజ్, బొలివియా, కొలంబియా , కాస్తారికా , డొమినిక్ రిపబ్లిక్ , ఈక్వెడార్, ఈఐసాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హూండురాస్, జమైకా, లావోస్, మెక్సికో, నైకాగువా, పనామా, పెరూ, వెనిజుల లాంటి దేశాలతో పాటు భారత్‌ను కూడ చేర్చారు ట్రంప్.

US President Donald Trump Puts India on List of Illegal Drug Producing Nations

భౌగోళిక స్వరూపం, వాణిజ్య వ్యవహరాలు, ఆర్థిక వ్యవస్థ ప్రభావాల వంటివి ఈ దేశాల్లో డ్రగ్స్ ఉత్పత్తికైనా రవాణా చేసేందుకు అనుకూలంగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

పన్నెండు మాసాలుగా బొలివియా, వెనిజులా దేశాలు డ్రగ్స్ నివారణలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పారు. గత ఏడాదిగా కొలంబియాలో మత్తుపదార్థాలకు అవసరమైన సాగు చేయడం ఎక్కువైందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+