ఇప్పుడు మొత్తుకుంటే ఏం లాభం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. నోబెల్ శాంతి పురస్కరానాన్ని గెలుచుకోవాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. ఈ రేసు నుంచి ఆయన అవుట్ అయ్యారు. ఆయన ఆశలపై నోబెల్ కమిటీ నీళ్లు చల్లింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) విజేత పేరును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. వెనెజులాకు చెందిన సామాజిక ఉద్యమ, మానవ హక్కుల కార్యకర్త మారియా కొరినా మచాడో (Maria Corina Machado)కు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
వెనిజులా ప్రజాస్వామ్య పోరాట యోధురాలు మారియా కోరినా మచాడో. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అక్కడి నిరంకుశ పాలనను అంతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. అహింసా మార్గంలో తన పోరాటాన్ని సాగించారు. అల్లకల్లోలానికి గురవుతున్న వెనిజులాలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పారు. హింసను విడనాడాలంటూ పిలుపునిచ్చారు. అహింసాయుత పోరాటాన్ని ముందుండి నడిపించారు.

ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి లభించకపోవడం పట్ల వైట్ హౌస్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ పడిన శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదని పేర్కొంది. ఎనిమిది యుద్ధాలు, వివిధ దేశాల్లో అశాంతిని చల్లార్చడానికి ట్రంప్ ఎంతగానో తపించారని, ఆయన ప్రయత్నాలను నోబెల్ కమిటీ గుర్తించలేదని వ్యాఖ్యానించింది. ఇక్కడ శాంతి కంటే రాజకీయాలు అధికం అయ్యాయని నోబెల్ కమిటీ నిరూపించిందని విమర్శించింది. ఈ నిర్ణయం- రాజకీయ ప్రేరేపితమని ఆరోపించింది.
ఈ అవార్డు- నిజమైన ప్రపంచ శాంతికి కట్టుబడి ఉండటానికి బదులుగా పక్షపాతాన్ని ప్రతిబింబించిందని వైట్ హౌస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. నోబెల్ బహుమతి విజేత పేరును ప్రకటించడానికి కొన్ని గంటల ముందు.. డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఒబామా ఏమీ చేయకుండా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారని ట్రంప్ ఆరోపించారు. దేశాన్ని నాశనం చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం లభించిందని ధ్వజమెత్తారు.
శాంతి అంటే ఏమిటో తెలియకుండా ఆ బహుమతికి ఎంపికయ్యాడని, అమెరికాను నాశనం చేసినందుకు ఈ పురస్కారం అందుకున్నాడని ట్రంప్ మండిపడ్డారు. 2009లో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎనిమిది నెలల తర్వాత ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఇప్పుడు తాను ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించినప్పటికీ ఆ అవకాశం దక్కలేదని అన్నారు.
ఇప్పటివరకు, నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. రుస్సో-జపనీస్ యుద్ధాన్ని ముగించడంలో మధ్యవర్తిత్వం వహించినందుకు 1906లో థియోడర్ రూజ్‌వెల్ట్, లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించినందుకు 1919లో వుడ్రో విల్సన్, మానవ హక్కుల పరిరక్షణ, శాంతికి కృషి చేసినందుకు 2002లో జిమ్మీ కార్టర్, 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!











Click it and Unblock the Notifications