అలా అయితే మా సపోర్ట్ ఉండదు.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్ !
ఇజ్రాయెల్ ప్రభుత్వం వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ ఈ చర్యలో ముందుకెళ్తే, అమెరికా నుండి లభిస్తున్న రాజకీయ, సైనిక, ఆర్థిక మద్దతును పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
కాగా ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్) ఇటీవల రెండు వివాదాస్పద బిల్లులను 25-24 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లులు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను ఇజ్రాయెల్ అధికార పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ చర్యతో ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ మరింత తీవ్రమవుతుందని అంచనా వేశారు.

వెస్ట్ బ్యాంక్ అనేది 1967 ఆరు రోజుల యుద్ధం నుంచి ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం. ఇక్కడ సుమారు 30 లక్షల పాలస్తీనా ప్రజలు, దాదాపు 5 లక్షల ఇజ్రాయెల్ వలసదారులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంపై పూర్తి హక్కు సాధించాలనే ప్రయత్నం ఇజ్రాయెల్‌లోని కఠిన హిందుత్వ వాద రాజకీయ పార్టీల డిమాండ్ గా భావిస్తున్నారు.
ఈ మేరకు టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్‌కు పెద్ద తప్పిదం అవుతుందన్నారు. ఇది అమెరికా మద్దతును కోల్పోవడానికి దారి తీస్తుందని.. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన శాంతి ఒప్పందాలు, అరబ్ దేశాలకు ఇచ్చిన హామీలు ఈ చర్యతో భంగం చెందుతాయని పేర్కొన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ చర్యపై సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఈజిప్ట్ వంటి అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ దేశాలు యునైటెడ్ నేషన్స్ సమావేశంలో వెస్ట్ బ్యాంక్ స్వాధీనంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నాయి.
ఇజ్రాయెల్ ఈ దిశగా ముందుకెళితే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు రగులుతాయి. గాజా ప్రాంతం, లెబనాన్ సరిహద్దుల్లో సాయుధ గుంపులు చురుకుగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా కూడా సైనిక స్థావరాలను బలోపేతం చేయవలసి వస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications