Biden-Modi: మోడీ మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాల్సిందే..! జో బైడెన్ సరదా వ్యాఖ్యలు..
భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాఫులారిటీ మాములుగా లేదు. ఆయన ఏ దేశానికి వెళ్లిన ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తాజాగా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆటోగ్రాఫ్ అడిగారని వార్తలు వస్తున్నాయి. నరేందర్ జీ7 శిఖరాగ్ర సమావేశం కోసం హీరోషమాకు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకున్నారు.
జో బైడెన్ కోరిక మేరకు మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి వీరిద్దరు మాట్లాడుకున్నట్లు తెలిసింది. మోడీ పాల్గొనబోయే సమావేశాల్లో తమను భాగస్వాములను చేయాలని చాలా మంది ముందుకొస్తున్నారని బైడెన్ మోడీ దృష్టికి తీసుకొచ్చరట. చాలా మంది తెలియని వారు కూడా ఫోన్ చేసి మోడీని కలిసేలా చేయాలని కోరుతున్నారని బైడెన్ అన్నట్లుగా ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది.

ఇంతలో అక్కడికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తాను కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొట్లు చెప్పారు. మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్ కోసం 20,000 మంది కెపాసిటీ ఉందని కాని అంత కంటే ఎక్కువ మంది వస్తామని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నరేంద్ర మోడీ స్టేడియంలో విజయోత్సవ ల్యాప్‌లో 90,000 మందికి పైగా ప్రజలు ప్రధాని మోడీకి ఎలా స్వాగతం పలికారో ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు.
దీనికి జో బిడెన్ "నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి" అని ప్రధాని మోడీని అన్నట్లు పలు వార్తక థనాలు వచ్చాయి. మోడీ మీరు నిజంగా తనకు చాలా పెద్ద సమస్య తెచ్చి పెట్టారని బైడెన్ సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాగా ఈ ఏడాది మార్చిలో అహ్మదబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ను మోడీ, అల్బనీస్ వీక్షించారు.












Click it and Unblock the Notifications