• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

జోసెఫ్ బైడెన్ అనే నేను....: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం

|

'ఇనాగరేషన్ డే'గా పిలుచుకునే అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం(జనవరి 20న) నాడు ప్రమాణం చేశారు. అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా ఇదే రోజు పదవీ బాధ్యతలు చేపట్టారు

ఇనాగరేషన్ డే-2021 కార్యక్రమానికి ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20న(బుధవారం) రాత్రి 10.00 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత అమెరికా జాతీయగీతాన్ని ఆలపించారు. యూఎస్ కొత్త ఫస్ట్ లేడీ జిల్ బైడెన్(జోబైడెన్ భార్య) ప్రజలనుద్దేశించి మొదటగా లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగించారు. ఇక జో బైడెన్‌ ప్రమాణస్వీకారంకు సంబంధించి మినిట్-టూ- మినిట్ అప్‌డేట్స్ లైవ్‌లో మీకోసం...

US President Joe Bidens Inauguration Live Updates In Telugu

Newest First Oldest First
10:50 PM, 20 Jan
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్విటర్ ప్రొఫైల్‌ మార్చిన కమలా హ్యారిస్. ప్రజలకు సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తొలి ట్వీట్
10:47 PM, 20 Jan
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు శుభాబినందనలు తెలిపిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
10:46 PM, 20 Jan
ప్రపంచ దేశాలతో మరోసారి మాట్లాడతాను: జో బైడెన్
10:45 PM, 20 Jan
మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్న శక్తులు ఎప్పుడూ ఉంటాయి.ఇవి అమెరికాకు కొత్త కాదు.వీటిని ఎదుర్కొని ఎన్నో సార్లు విజయం సాధించాం: జో బైడెన్
10:43 PM, 20 Jan
శాంతి కోరుకునే దేశాలతో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ముందుటాను: జో బైడెన్
10:42 PM, 20 Jan
అమెరికా ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాను: జో బైడెన్
10:42 PM, 20 Jan
జో బైడెన్ ఐకమత్యంతో ఎలా ఉండాలో నేర్పుతారు: జో బైడెన్
10:39 PM, 20 Jan
కరోనావైరస్ కారణంగా 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికి నివాళులు అర్పించిన జో బైడెన్
10:38 PM, 20 Jan
సరిహద్దు దేశాలతో ఉన్న బేదాభిప్రాయాలకు మరమత్తులు చేస్తాం: జో బైడెన్
10:37 PM, 20 Jan
ఒక్క దేశంగా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని విజయం సాదిద్దాం: జో బైడెన్
10:37 PM, 20 Jan
అమెరికాలో ఈ రోజు ప్రజాస్వామ్య దినోత్సవం: జో బైడెన్
10:36 PM, 20 Jan
అన్ని సవాళ్లకు సమస్యలకు పరిష్కారం కనుగొంటాం: జో బైడెన్
10:36 PM, 20 Jan
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. భారత్ అమెరికా బంధాలు మరింత బలపడతాయి: ప్రధాని మోడీ
10:35 PM, 20 Jan
ఇదొక చారిత్రాత్మక ఘట్టం:జో బైడెన్
10:34 PM, 20 Jan
అమెరికా పౌరులందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటాను. తనకు మద్దతు తెలపని వారికి కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని ప్రమాణం చేస్తున్నా: జో బైడెన్
10:33 PM, 20 Jan
అమెరికాకు చికిత్స చేస్తాం..నూతన విధానాలతో ముందుకెళతాం: జో బైడెన్
10:32 PM, 20 Jan
కరోనావైరస్ పై విజయం సాధిస్తాం అందులో అనుమానమే లేదు:బైడెన్
10:32 PM, 20 Jan
ఒకరినొకరిని గౌరవించుకుందాం, మర్యాదపూర్వకంగా పలకరించుకుందాం: బైడెన్
10:32 PM, 20 Jan
సుభిక్షమైన అమెరికా కోసం తనకు సహకరించాల్సిందిగా కోరిన బైడెన్
10:32 PM, 20 Jan
ఉగ్రవాదంను ఉక్కుపాదంతో అణిచివేస్తాం: జో బైడెన్
10:29 PM, 20 Jan
జాతి వివక్షకు తావు లేకుండా చేస్తాం
10:29 PM, 20 Jan
అతివాదంపై విజయం సాధిస్తాం: బైడెన్
10:19 PM, 20 Jan
జోసెఫ్ బైడెన్‌తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించిన అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
10:17 PM, 20 Jan
గత 150 ఏళ్లలో వారసుడిగా వస్తున్న కొత్త అధ్యక్షుడికి స్వాగతం పలకకుండా గైర్హాజరైన వ్యక్తిగా ట్రంప్ రికార్డు
10:14 PM, 20 Jan
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు భారత సంతతి వ్యక్తి కమలా హారిస్
10:11 PM, 20 Jan
ముందుగా ప్రమాణస్వీకారం చేసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
10:08 PM, 20 Jan
ఈ అద్భుతమైన ఘట్టంలో తనపక్కన తన భార్య లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ జో బిడెన్ భావోద్వేగ ట్వీట్.
10:07 PM, 20 Jan
అమెరికా జాతీయగీతంను ఆలపించిన ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా
10:01 PM, 20 Jan
ప్రార్థనతో ప్రారంభమైన జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం
9:55 PM, 20 Jan
కమలా హ్యారిస్ సొంత గ్రామం తులసేంద్రపురంలో పండగ వాతావరణం
READ MORE

English summary
The Newly elected US President Joe Biden is all set for the swearing in Ceremony on the US inauguration day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X