Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉక్రెయిన్‌కు కూతవేటు దూరంలో జో బైడెన్ మకాం: భగ్గుమంటోన్న రష్యా

బ్రస్సెల్స్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నెల రోజులు దాటేసింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం రావణకాష్ఠంలా మండుతూనే ఉంది. రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ఒకవంక శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. రష్యా సంధిస్తోన్న రాకెట్లు, మిస్సైళ్ల ధాటికి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు ధ్వంసం అయ్యాయి. మరుభూమిగా మారాయి.

జీ20 నుంచి అవుట్..?

జీ20 నుంచి అవుట్..?

ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాపై పాశ్చాత్య దేశాలన్నీ వ్యతిరేకంగా నిలిచాయి. యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్య దేశాలు.. రష్యాపై భగ్గుమంటోన్నాయి. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలు, నిషేధాలను జారీ చేశాయి. తాజాగా జీ 20 నుంచి కూడా బహిష్కరించడానికి పావులు కదుపుతున్నాయి. రష్యాతో దశాబ్దకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే తటస్థంగా ఉంటూ వస్తోన్నాయి. అలాగనీ- యుద్ధాన్ని సమర్థించట్లేదు. యుద్ధం నిలిపివేయాలంటూ భారత్.. తన గళాన్ని వినిపిస్తూనే ఉంది.

అంతర్జాతీయ మద్దతు కోసం అమెరికా..

అంతర్జాతీయ మద్దతు కోసం అమెరికా..


రష్యాకు వ్యతిరేక కూటమి దేశాలకు అమెరికా నాయకత్వాన్ని వహిస్తోంది. ఈ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడానికి వ్యూహాలు పన్నింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పాటైన నాటో సభ్య దేశాల అత్యవసర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమ్మిట్‌ను ఉద్దేశించి- ప్రసంగించారు. రష్యాపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. జీ 20 నుంచి తప్పించాలని సూచించారు.

నాటో సభ్య దేశ పర్యటనకు..

నాటో సభ్య దేశ పర్యటనకు..


బెల్జియం పర్యటనను ముగించుకున్న అనంతరం జో బైడెన్.. నేరుగా పోలాండ్ బయలుదేరి వెళ్లనున్నారు. నాటోలో సభ్యత్వం ఉన్న దేశం ఇది. ఉక్రెయిన్‌కు ఆనుకునే ఉంటుంది. ఆ దేశంతో సరిహద్దులను పంచుకుంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న దేశాల్లో ఇదీ ఒకటి. రష్యాపై కఠిన ఆంక్షలను సైతం విధించింది. అనేక నిషేధాజ్ఞలను జారీ చేసింది. నాటో అత్యవసర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం జో బైడెన్.. పోలాండ్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఉక్రెయిన్‌కు కూత వేటు దూరంలో..

ఉక్రెయిన్‌కు కూత వేటు దూరంలో..

రాజధాని వార్సాకు బదులుగా ఆర్జెస్జో అనే పట్టణంలో జో బైడెన్ మకాం వేయనున్నారు. రణక్షేత్రంలా మారిన ఉక్రెయిన్‌కు కూతవేటు దూరంలో ఉంటుందీ టౌన్. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటి చోట జో బైడెన్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్ర్జెజ్‌తో సమావేశమౌతారు. రష్యా దూకుడును అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

ఉక్రెయిన్ పొరుగు దేశంలో మకాం..

ఉక్రెయిన్ పొరుగు దేశంలో మకాం..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న వేళ.. పొరుగు దేశంలో జో బైడెన్ మకాం వేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఉక్రెయిన్ సాగిస్తోన్న యుద్ధాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ సైన్యానికి దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని జో బైడెన్ స్వయంగా పర్యవేక్షించడాన్ని రష్యా తప్పు పడుతోంది. అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అమెరికా చర్యలు- మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయంటూ మండిపడుతోంది.

Recommended Video

    Russia వ్యతిరేక కూటమిలో India ను మినహాయించినట్టే..! - Joe Biden| Oneindia Telugu
    న్యూక్లియర్ ఆయుధాల ప్రయోగం..

    న్యూక్లియర్ ఆయుధాల ప్రయోగం..


    ఉక్రెయిన్‌పై యుద్ధం మరింత కాలం పాటు కొనసాగాల్సి వస్తే.. న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించాల్సి ఉంటుందనే విషయాన్ని రష్యా తోసిపుచ్చట్లేదు. రసాయనిక, జీవాయుధాలను ప్రయోగించడంలో వెనుకాడబోమనే సందేశాన్ని ఇదివరకే పంపించింది. ఈ యుద్ధంలో అమెరికా జోక్యం మితిమీరిందంటూ క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. ఇది ఇలాగే కొనసాగితే- అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+