ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దుల్లో జో బైడెన్ టూర్‌..! రష్యా యుద్ధం కొనసాగిస్తున్న వేళ..!!

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్‌లో పర్యటనకు శ్రీకారం చుట్టారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ఆయన పోలాండ్‌లోని రెజెస్టో పట్టణంలో అడుగుపెట్టారు. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ .. జో బైడెన్ పర్యటన అత్యంత‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పోలాండ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈయూ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.

ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల ప‌రిస్థితుల‌పై ఆరా..

ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల ప‌రిస్థితుల‌పై ఆరా..


పోలాండ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న రెజెస్టో నగరానికి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ఉక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్థుల పరిస్థితులు గురించి తెలుసుకోనున్నారు. వారికి అందుతున్న సహాయక చర్యలపై ఎన్టీవోలతో ముచ్చ‌టిస్తారు. అనంత‌రం సమీక్షనిర్వహించ‌నున్నారు. అదే విధంగా అక్కడ మోహరించిన 82వ అమెరికా ఎయిర్ బోర్న్ డివిజన్ సభ్యులతో ముచ్చటించనున్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అటు జోబైడెన్ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న యూరోపియన్ యూనియన్ దేశాలు మ‌రింత అప్రమత్తమయ్యాయి. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో జో బైడెన్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఉక్రెయిన్ సంక్షోభం, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌, ఇరుదేశాల మ‌ధ్య ద్వైపాక్షిక అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తారు.

ఇంధ‌నంపై అమెరికా-ఈయూ మ‌ధ్య కీల‌క ఒప్పందం


మరోవైపు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా ఉండేందుకు అమెరికా, ఈయూ దేశాలు సహజ వాయువు సరఫరాపై కీలకమైన ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది చివరినాటికి ఈయూకీ అదనంగా 15 బిలియన్ల క్యూబిక్ మీటర్ల ఎన్ఎన్జీని అమెరికా కేటాయించాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రస్సైల్స్‌లో పర్యటనలో భాగంగా ఈ ప్రధాన ఒప్పందాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించింది. ర‌ష్యాపై ఆధార‌ప‌డ‌కుండా ప్ర‌త్యామ్నాయం వైపు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి.

 పోలాండ్‌కు 22 ల‌క్ష‌ల మంది పౌరులు

పోలాండ్‌కు 22 ల‌క్ష‌ల మంది పౌరులు


అటు ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుదాలను ప్రయోగించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగించినప్పటికీ .. తమకు మాత్రం అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. రష్యాను ప్రతిఘటించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటు నాటో దేశాలు పూర్తిగా సహాకారాన్ని అందిస్తామని తెలిపారు. అవసరమైన యుద్ధ సామాగ్రిని, నిధులను అందిస్తున్నట్లు వెల్లడించింది. రష్యా దాడులు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 22 లక్షల మంది పౌరులు తమ దేశంలోకి ప్రవేశించినట్టు పోలాండ్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+