వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ ఆరోపణలు తోసిపుచ్చిన అమెరికా-పాక్ రాజ్యాంగాన్నిగౌరవిస్తామని క్లారిటీ

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణల్ని యూఎస్ ఇవాళ ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ ఆరోపణలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. తన ప్రభుత్వం కుప్పకూలడానికి విదేశీ కుట్ర కారణమంటూ ఇమ్రాన్ ఖాన్ కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. అయితే స్వదేశంలో మాత్రం ఆయన ఆరోపణల్ని ఎవరూ నమ్మడంలేదు.

ప్రతిపక్ష పార్టీల సహాయంతో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి వాషింగ్టన్‌లో పన్నిన "విదేశీ కుట్ర"పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇమ్రాన్ ఖాన్ తన స్వతంత్ర విదేశాంగ విధానం కారణంగా తనపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం విదేశీ కుట్ర ఫలితమేనని, తనను అధికారం నుంచి తప్పించేందుకు విదేశాల నుంచి నిధులు తరలిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, 69 ఏళ్ల ఇమ్రాన్.. ఒక సీనియర్ యూఎస్ దౌత్యవేత్త పాకిస్తాన్‌లో తన ప్రభుత్వాన్ని మారుస్తామంటూ బెదిరించారని ఆరోపించారు.

US refutes Imran khans conspiracy allegations to overthrow his government in Pakistan

విదేశాంగ శాఖలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విదేశీ కుట్రలో పాల్గొన్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని ఖాన్ చేసిన ఆరోపణలపై సమాధానమిస్తూ, డిప్యూటీ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి జలీనా పోర్టర్ స్పందించారు.

ఈ ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి, తాము ఈ పరిణామాలను ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. తాము పాకిస్తాన్ రాజ్యాంగ ప్రక్రియ, చట్ట నియమాలను గౌరవిస్తామన్నారు. అలాగే మద్దతు ఇస్తున్నామన్నారు. కానీ ఖాన్చేసిన ఆరోపణలు మాత్రం నిజం కాదన్నారు.

English summary
The US has refuted former pakistan pm imran khan's allegations to overthrow his govt today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X