బిన్ లాడెన్ ను లేపేసిన తరహాలో ఖమేనీపై అమెరికా స్కెచ్..! అత్యంత సురక్షిత బంకర్ దాక్కున్న ఇరాన్ సుప్రీం లీడర్
గత 8 రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లోని ముగ్గురు కీలక కమాండర్లు హతం అయ్యారు. అంతేకాక ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఇరాన్ లోని ఇస్ఫాహాన్ అణు కేంద్రం కూడా పూర్తిగా ధ్వంసం అయింది. మరోవైపు ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. ఇరాన్ లోని కీలక అణు స్థావరాలపై అమెరికా దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పలు అణు స్థావరాలపై అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకు భద్రత మరింత పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఖమేనీ ఓ రహస్య సురక్షితమైన బంకర్ లో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆయన ఉండే ప్రదేశంలో ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లను పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఘోర యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చావు భయంతో ఉనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన తరువాతి వారసుడ్ని ప్రకటించేందుకు ఖమేనీ సిద్ధమయ్యారు. ఈ మేరకు తన తరువాత ఇరాన్ కు నాయకత్వం వహించేందుకు ముగ్గురు పేర్లను ఆయన ప్రతిపాదించారు. ఈ ముగ్గురు క్లెరిక్ లకు ఆ సామర్థ్యం ఉందని ఖమేనీ తెలిపారు.
మూడు దశాబ్దాలుగా ఇరాన్ ను పరిపాలిస్తూ వచ్చిన ఖమేనీ.. తాజా పరిణామాలతో ఆ బాధ్యతలను తన వారసుడికి ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రతిపాదించిన పేర్లలో ఆయన కుమారుడు మోజ్ తాబా పేరు లేకపోవడం గమనార్హం అని న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు వెల్లడించింది.

ఓ వైపు ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మరోవైపు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన చర్చలు విఫలం అయ్యాయి. ఈ సమావేశానికి ఐరోపా విదేశాంగ మంత్రులు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ లు దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిపారు. అయినా ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం అయ్యాయి. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications