వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్ట్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు 26% తగ్గిన ధరఖాస్తులు

ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా అమెరికన్ యూనివర్శిటీల్లో ఉన్నత విద్య కోసం ధరఖాస్దు చేసుకొనే భారతీయ విధ్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఓ సర్వే వెల్లడించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా అమెరికన్ యూనివర్శిటీల్లో ఉన్నత విద్య కోసం ధరఖాస్దు చేసుకొనే భారతీయ విధ్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఓ సర్వే వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా ఆ దేశం వెళ్లాలంటే భయపడుతున్నారు.

ప్రధానంగా అమెరికాలో ఇండియన్లపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి.తమ దేశం విడిచివెళ్ళిపోవాలంటూ చెబుతూ దాడులకు పాల్పడుతున్నారు.

అయితే ఐటి పరిశ్రమలకు సంబందించి ఉద్యోగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది.ఐటీ పరిశ్రమ తర్వాత చదువు కోసం అమెరికాను ఎంచుకొనే విధ్యార్థులు కూడ ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితులను చూసీ ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు.

అమెరికాలో చదువంటే భయపడుతున్న విధ్యార్థులు

అమెరికాలో చదువంటే భయపడుతున్న విధ్యార్థులు

అమెరికాలో చోటుచేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళాంటే చాలా మంది ఆసక్తిని చూపడం లేదు. తాము కోరుకొన్న చదువును అమెరికా కాకుండా ఇతర దేశాల్లోని యూనివర్శిటీల్లో ఉన్నాయో లేదో చూస్తున్నారు. అమెరికేతర ప్రజలపై ఆమెరికాలో చోటుచేసుకొంటున్న దాడుల పట్ల ఎక్కువగా ఆందోళనకు గురౌతున్నారు.అయితే అమెరికా మినహ ఇతర దేశాలను వారు ఎంచుకొంటున్నారు.

అమెరికా విశ్వవిద్యాలయాలకు తగ్గిన ధరఖాస్తులు

అమెరికా విశ్వవిద్యాలయాలకు తగ్గిన ధరఖాస్తులు

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొచ్చిన వీసా నిబంధనలు, పెచ్చరిల్లుతున్న జాతి విద్వేషపూర్వకదాడుల వల్ల అమెరికన్ యూనివర్శిటీల్లో ధరఖాస్తులు తగ్గిపోతున్నాయి.250 కి పైగా అమెరికన్ కాలేజీల్లో ఆరు టాప్ అమెరికన్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ లో భారతీయ విద్యార్థుల ధరఖాస్తులు 26 శాతానికి పడిపోయినట్టుగా ఓ సర్వే వెల్లడించింది.

గ్రాడ్యుయేట్ అప్లికేషన్స్ కూడ తగ్గాయి

గ్రాడ్యుయేట్ అప్లికేషన్స్ కూడ తగ్గాయి

ఉన్నత విద్య అభ్యసించే విధ్యార్థులే కాదు గ్రాడ్యుయేట్ అప్లికేషన్స్ కోసం ధరఖాస్దులు కూడ అతి తక్కువే వచ్చాయి.15 శాతం గ్రాడ్యుయేట్ అప్లికేషన్స్ తగ్గాయని సర్వే తేల్చి చెప్పింది. అంతర్జాతీయ విద్యార్థుల అప్లికేషన్లు కూడ సగటున 40 శాతం పడిపోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజియేట్ రిజిస్ట్రార్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫీసర్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కౌన్సిలింగ్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలను వెల్లడించాయి.

.ఉన్నత విద్యకోసం47 శాతం ఇండియా, చైనా విధ్యార్థులే

.ఉన్నత విద్యకోసం47 శాతం ఇండియా, చైనా విధ్యార్థులే

అమెరికా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్ రోల్ మెంట్ లో చైనా, భారత్ లు 47 శాతం ఉంటాయి. అమెరికాలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల్లో సగం మంది ఈ దేశాల నుండే ఉంటారని సర్వే రిపోర్ట్ చెబుతోంది.కానీ, ఇటీవల నెలకొంటున్న పరిణామాలు అమెరికా యూనివర్శిటీల్లో విద్యార్థుల ధరఖాస్దులను తగ్గించేస్తున్నాయని రిపోర్ట్ పేర్కొంది.

చైనా నుండి కూడ తగ్గిన ధరఖాస్తులు

చైనా నుండి కూడ తగ్గిన ధరఖాస్తులు

చైనా నుండి కూడ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ధరఖాస్తులు 25 శాతం , గ్రాడ్యుయేట్స్ స్టడీస్ ధరఖాస్తులు 32 శాతం పడిపోయినట్టు తెలిసింది. తాజా కార్యనిర్వాహక ఆదేశాలు ప్రస్తుత అప్లికెంట్స్ , స్టూడెంట్లపై ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావం భవిష్యత్తులో కూడ ఉంటుందని ఫోర్ట్ లాండ్ స్టేట్స్ ప్రెసిడెంట్ విమ్ వైవెల్ చెప్పారు.ఈ ఏడది పోర్ట్ లాండ్ యూనివర్శిటీలో 27 శాతం భారతీయుల విద్యార్థులు తగ్గిపోయిందని నివేదిక చెబుతోంది.

భారతీయులపై దాడులే ప్రధాన కారణం

భారతీయులపై దాడులే ప్రధాన కారణం

కాన్సాస్ లో భారతీయ టెక్కీ శ్రీనివాస్ కూచిబొట్లపై అమెరికాలో జాతి విద్వేషదాడి ఘటన ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాకు భారత్ నుండి వచ్చే విద్యార్థుల ధరఖాస్తులపై ఈ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోందని న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రోవోస్ట్ జాన్ జే వూడ్ తెలిపారు.మాస్టర్స్ చేసిన భారతీయులు ఎక్కువగా ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా జాబ్ పొంది ఇక్కడే మూడేళ్ళు వర్క్ చేసుకొనే సదుపాయం కలిగి ఉంటుంది, కానీ, వీసా నిబంధనల్లో తాజాగా తీసుకొచ్చిన మార్పులు విద్యార్థుల్లో ఆందోళన కల్గిస్తున్నాయని వూడ్ చెప్పారు. అంతేకాక ట్రావెల్ నిషేధం కూడ వీటిపై ప్రభావం చూపుతోందన్నారు.

English summary
US universities have registered a sharp decline in the number of applications from Indian students after a spate of hate crimes+ and fear and anxiety about potential changes to visa policies+ by the Trump Administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X