వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీలీక్స్ నిఘా వార్త: ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఒబామా ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుల పైన నిఘా వేశారాన్న వికీలీక్స్ వార్తను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొట్టి పారేశారు. తాము ఫ్రాన్స్ అధ్యక్షులు ఎవరి పైనా ఎలాంటి నిఘా పెట్టలేదని ఒబామా చెప్పాడు. ఫోన్ ద్వారా హోలాండోతో ఒబామా మాట్లాడాడు.

అమెరికాకు చెందిన జాతీయ భద్రతా సంస్థ.. ఫ్రాన్స్ గత ముగ్గురు అధ్యక్షుల పైన నిఘా పెట్టిందని వికీలీక్స్ బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా విడుదల చేసింది. ఈ పత్రాల్లోని వివరాలను ఫ్రెంచ్ పత్రిక లిబరేషన్, పరిశోధనాత్మక వెబ్ సైట్ మీడియా పార్ట్ ద్వారా వెల్లడించింది.

 US wasn't spying on france, says Obama

గ్రీస్ ఆర్థిక వ్యవస్థ, జర్మనీతో సంబంధాలు, అమెరికా గూఢచర్యం వంటి అంశాలపై మాట్లాడిన మాటలను అమెరికా రికార్డు చేసినట్లు ఈ పత్రాల్లో ఉంది. పెద్దగా రహస్యాలు లేనప్పటికీ ఫ్రెంచ్ రాజకీయవేత్తల్లో కలకలం రేపింది. అమెరికా చరయ్ పట్ల ఫ్రాన్స్ అభ్యంతరం తెలిపింది. మిత్రదేశంపై నిఘా పెట్టడాన్ని ప్రశ్నించింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ అత్యవసరంగా సమావేశం నిర్వహించి అమెరికా చర్యను నిరసించారు. అనంతరం ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. తన భద్రతకు ముప్పుగా పరిణమించే చర్యలను ఫ్రాన్స్ సహించదని పేర్కొన్నారు. దీంతో ఒబామా వివరణ ఇచ్చారు.

English summary
US wasn't spying on france, says Obama
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X