భారత్ మత గురువుపై అమెరికా మహిళ కేసు

వాషింగ్టన్: తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భారత్ కేథలిక్ మత గురువు, ఆయన పని చేస్తున్న చర్చి మీద అమెరికాకు చెందిన మహిళ కేసు పెట్టింది. మత గురువు జోసెఫ్ జయపాల్, ఆయన పని చేస్తున్న చర్చి మీద మిన్నె సోటాలో కేసు నమోదు అయ్యింది.

మత గురువు జోసెఫ్ జయపాల్ 2004-2005లో అమెరికాలోకి వచ్చినప్పుడు వేధించాడని అమెరికాకు చెందిన (26) మహిళ ఆరోపిస్తున్నది. తాను 14 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయపాల్ భారత్ లోని పిల్లల మీద వేధింపులకు పాల్పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

US Woman files lawsuit against Indian Bishop

మిన్నె సోటాలోని క్రూక్ స్టన్ సిటీ చర్చిలో 2004 నుంచి 2005 వరకు జయపాల్ మత గురువుగా వ్యవహరించారు. ఆ సందర్బంలో తన మీద లైంగిక వేదింపులకు పాల్పడమే కాకుండా అవమానాలకు గురి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కేసులో జయపాల్ ను భారత్ పోలీసులు అరెస్టు చేశారు.

తరువాత జయపాల్ ను ఆమెరికా పోలీసులకు అప్పగించారు. అయితే ఇటీవల జయపాల్ మీద విధించిన నిషేదాన్నిఎత్తివేసి విధుల్లో నియమించడానికి వాటికన్ నిర్ణయం తీసుకుంది. భారత్ మత గురువు మీద ఆరోపణలు చేస్తున్న మహిళ తనకు అన్యాయం జరిగిందని అంటున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+