కరోనా బారిన పడిన పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్: అందరూ క్షేమంగా ఉండాలని..
వాషింగ్టన్: ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే అతడు తన 34వ పుట్టిన రోజును ఎంతో అట్టహాసంగా నిర్వహించుకున్నారు.
బంగారు పతక విజేత అయిన ఉసేన్ బోల్డ్ కరోనా పాజిటివ్ గా తేలడంతో సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారని సమాచారం. ఇటీవల అతడు తన 34 వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇందులో ప్రముఖులతోపాటు చాలా మంది పాలుపంచుకున్నారు.

అయితే, ఆగస్టు 21న జరిగిన ఈ పార్టీలో ఎవరూ మాస్కులు కూడా పెట్టుకోలేదు. భౌతిక దూరం అనే మాటేలేదు. అయితే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ కరోనా బారినపడటంతో ఆ పార్టీలో పాల్గొన్నవారందరూ ఆందోళనకు గురవుతున్నారు. వారిలో కొందరు సెల్ఫ్ క్వారంటైన్ ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Stay Safe my ppl 🙏🏿 pic.twitter.com/ebwJFF5Ka9
— Usain St. Leo Bolt (@usainbolt) August 24, 2020
తాను కరోనా బారిన పడ్డానని చెప్పిన ఉసేన్ బోల్ట్.. తాను బాధ్యతగా ఉండాలనుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా సోకిన నేపథ్యంలో తాను సెల్ఫ్ హోంక్వారంటైన్లో ఉంటున్నట్లు తెలిపారు. అంతేగాక, తనను అభిమానించేవారంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.












Click it and Unblock the Notifications