వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్ధన: ప్రమాణం చేయించిన అధ్యక్షుడు విక్రమసింఘే

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంకలో ఇప్పుడిప్పుడే పరిస్థితలు కొంత స్థిమితపడుతున్నాయి. కొత్తగా నాయకులు బాధ్యతలు తీసుకుంటున్నారు. తాజాగా, శ్రీలంక కొత్త ప్రధానిగా సీనియర్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్దన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలోని ఫ్లవర్ రోడ్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా, గుణవర్దన, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చాలా కాలం రాజపక్సే విధేయుడిగా కొనసాగారు. 73 ఏళ్ల గుణవర్దన ఇంతకుముందు విదేశాంగ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్‌లో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఆయనను హోం మంత్రిగా నియమించారు.

Veteran politician Dinesh Gunawardena Appointed Sri Lankas New Prime Minister.

గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయి, పెద్ద ఎత్తున నిరసనల మధ్య రాజీనామా చేసిన తర్వాత.. విక్రమసింఘే గురువారం శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలావుండగా, గోటబయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో రాజధాని కొలంబోలోని ప్రెసిడెంట్ సెక్రటేరియట్‌ను ఆక్రమించిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల బృందాన్ని శ్రీలంక భద్రతా దళాలు శుక్రవారం తెల్లవారుజామున బయటకు పంపించేశాయి.

వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. నిరసనకారులు జూలై 9 న వారిని స్వాధీనం చేసుకున్న తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి నివాసాలతో పాటు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అంతకుముందు ఖాళీ చేశారు. వారు ఇప్పటికీ గాల్ ఫేస్‌లోని రాష్ట్రపతి సచివాలయంలోని కొన్ని గదులను ఆక్రమించారు.

English summary
Veteran politician Dinesh Gunawardena Appointed Sri Lanka's New Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X