షాకింగ్: చైనాలో ఒళ్లుగగుర్పొరిచే ప్రమాదం (వీడియో)
బీజింగ్: చైనా దేశంలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. ఓ మోటారు సైకిలిస్ట్‌ను కారు గుద్దుకోవడంతో అతని వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతను ఓ హ్యూమన్ ఫైర్ బాల్‌గా మారాడు. అయితే, అతను గాయాలతో బయటపడ్డాడు. ఈ దారుణ సంఘటన ఈస్టర్న్ చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్.. ఖుజో పట్టణంలో చోటు చేసుకుంది.

32 ఏళ్ల ఫెంగ్‌కు కారు గుద్దుకోగానే సెకండ్లలో హ్యూమన్ ఫైర్ బాల్‌లా మారాడు! కారు అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో.. బ్యాలన్స్ ఆగక అతను, బైక్ కిందపడ్డాయి. దీంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు పైన ఓ కారు వేగంగా వస్తుంటుంది. ఎదురు రోడ్డులో కాకుండా.. పక్క రోడ్డు నుండి ఫెంగ్‌కు ఓ ద్విచక్ర వాహనం పైన వేగంగా వస్తుండగా.. కారు ఇతని బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత బైక్, అతను మంటల్లో చిక్కుకుపోయారు. ఇది వీడియోలో కనిపిస్తుంది.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/iX9bFd_N47Q?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
కారు గుద్దుకొని, కింద పడగానే జరగ్గానే ద్విచక్ర వాహనంలోని లీకైన పెట్రోలు కారణంగానే ఈ దారుణం జరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ సంఘటనను చూసిన కారు డ్రైవర్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. కొన్ని సెకండ్ల తర్వాత అతను కారు నుండి దిగి ఫెంగ్‌కు వద్దకు వచ్చే ప్రయత్నం చేశాడు.
ఇది గగుర్పొడిచే ప్రమాదమని, బైక్ కిందపడటంతో అతను పడ్డాడని, క్షణాల్లో మంటలు పుట్టాయని ఓ సాక్షి చెబుతున్నారు. అదృష్టవశాత్తూ అతను బతికి బయటపడ్డాడు. మంటలు అంటుకోగానే ఫెంగ్‌కు వాటిని చల్లార్చుకునేందుకు చుట్టుపక్కల చూశాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications