విజయ్ మాల్యాకు భారీ ఎదురుదెబ్బ -యూకే కోర్టులో ఎస్‌బీఐకి అనుకూల తీర్పు -ఆస్తుల వేలానికి లైన్ క్లియర్
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన బడా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా లండన్ హైకోర్టులో సోమవారం తీర్పు వెలువడింది.
ఇండియాలోని మాల్యా ఆస్తులపై తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడానికి ఈ కన్సార్షియంలోని బ్యాంకులకు యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది. దివాలా పిటిషన్‌లో దీనికి సంబంధించిన సవరణలు చేసేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం మాల్యాకు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు ఓ అడుగు ముందుకు పడినట్లయింది.

ఇండియన్ బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా చీఫ్ ఇన్‌సాల్వెన్సీస్ అండ్ కంపెనీస్ కోర్టు (ఐసీసీ) జడ్జి మైఖేల్ బ్రిగ్స్ తీర్పు చెప్పారు. తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడాన్ని నిరోధించే పబ్లిక్ పాలసీ ఏదీ లేదన్నారు. మాల్యా దివాలా తీసినట్లుగా ఆదేశాలు ఇవ్వడానికి మద్దతుగా, వ్యతిరేకంగా జూలై 26న తుది వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు.
మాల్యా కేసుకు సంబంధించిన విచారణలు వర్చువల్ పద్ధతిలో సాగాయి. కేసులను, వివాదాన్ని ప్రజలు మర్చిపోయే వరకు సాగదీయాలని మాల్యా ప్రయత్నిస్తున్నారని బ్యాంకులు ఆరోపించాయి. తాము దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను పరిష్కరించాలని కోర్టును కోరాయి. జస్టిస్ బ్రిగ్స్ ఇచ్చిన తీర్పులో, బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌ను సవరించేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
''దివాలా ఆదేశాలు జారీ అయ్యే సందర్భంలో, తమకుగల సెక్యూరిటీని అమలు చేసే హక్కుగల పిటిషనర్లు (బ్యాంకులు), దివాలా తీసినవారి రుణదాతలందరి ప్రయోజనం కోసం అటువంటి ఏదైనా సెక్యూరిటీని వదులుకోవడానికి అంగీకరిస్తున్నారు'' అని సవరించేందుకు అనుమతిస్తున్నట్లు తీర్పు చెప్పారు. పిటిషనర్లు తమ సెక్యూరిటీని వదులుకోవడాన్ని నిరోధించే చట్టపరమైన నిబంధనలేవీ లేవని ఈ తీర్పులో పేర్కొన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications