1.55 బిలియన్ డాలర్లు: లండన్ కోర్టులో విజయ్ మాల్యాకు భారీ ఎదురుదెబ్బ
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో గట్టి ఎదరు దెబ్బ తగిలింది. 1.55 బిలియన్ డాలర్ల వ్యాజ్యంలో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
ఈ తీర్పుతో భారతీయ బ్యాంకులు ఆయనకు ఇచ్చిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు అవకాశం కల్పించింది. మాల్యాకు రుణాలు ఇచ్చిన ఇండియన్ బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ దాఖల చేసింది.

జడ్జి ఆండ్రూస్ హెన్షా ఈ తీర్పును ఇచ్చారు. మాల్యా ఉద్దేశ్యపూర్వకంగా రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారని పేర్కొన్నారు. ఆయనపై 13 బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశాయి.












Click it and Unblock the Notifications