గ్రామ పెద్దల కారణంగా అత్యాచారానికి గురైన గర్భిణీ

పాకిస్థాన్ :గ్రామాల్లో పెద్దరాయుళ్ళ తీర్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద రాయుళ్ళు తమ ఇష్టారీతిలో తీర్పులు ఇస్తుంటారు. ఈ తీర్పులు ఓ వివాహిత ఆత్మహాత్యకు కారణమైంది. సమాజం తలదించుకొన విధంగా పెద్ద రాయుళ్ళు తీర్పులు చెప్పారు. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకొంది.

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకొంది. పంజాబ్ ప్రావిన్స్ లోని గుజరాత్ సిటీ చెందిన ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. బాలిక కుటుంబసభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు.అయితే గ్రామపెద్దలు తప్పుడు పద్దతిలో తీర్పును చెప్పారు . ఈ తీర్పు ఓ వివాహిత ప్రాణాలను తీసుకొనేలా చేసింది.

village elders verdict rape pregnant lady

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి కూతురును రేప్ చేయాలని గ్రామపెద్దలు మరో వ్యక్తిని ఆదేశించారు. తప్పు చేసింది ఒకరు , కాని శిక్షను మరోకరు అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే నిందితుడో అతని కూతురికి అప్పటికే వివాహమైంది. ఆమె నిండు గర్భిణీ. గర్భిణీ అని తెలిసి కూడ ఆమెపై గ్రామపెద్దలు అత్యాచారం జరపాలని ఆదేశించారు.

గ్రామపెద్దల తీర్పుకు అనుగుణంగా ఓ వ్యక్తి గర్భవతిపై అత్యాచారం చేశాడు. దీంతో అవమానం తట్టుకోలేక గర్భీణీ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబసభ్యులు ఆమెను లాహోర్ ఆసుపత్రికి తరలించారు. ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తనకు జరిగిన అవమానాన్ని భాదితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+