• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అర్ధరాత్రి అమెరికా పార్లమెంట్ భేటీ..ట్రంప్ తప్పుకోవడమే బాకీ: ఓట్ల లెక్కింపుపై జోరుగా

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టే. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనలు, ముట్టడి, దాడుల అనంతరం పార్లమెంట్ పునఃసమావేశమైంది. యూఎస్ కాంగ్రెస్, సెనెట్ సంయుక్తంగా భేటీ అయ్యాయి. ఈ సంయుక్త సమావేశాలకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సారథ్యాన్ని వహించారు. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. రాష్ట్రాలవారీగా డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్‌లకు పోల్ అయిన ఓట్లు..దానికి సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్ అందించిన ఫలితాలపై చర్చ సాగుతోంది.

రణరంగంగా వాషింగ్టన్: అల్లర్లలో మృతుల సంఖ్య అంతకంతకూ: రక్షణ బలగాలతో యుద్ధం

భారీ బందోబస్తు మధ్య.. రాత్రి భేటీ..

రాత్రి 10 గంటలు దాటిన తరువాత పరిస్థితులు కొంత చల్లారడంతో పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం అయ్యాయి. యూఎస్ కాంగ్రెస్, సెనెట్ సభ్యులందరూ మళ్లీ కేపిటల్ బిల్డింగ్‌కు చేరుకున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేపిటల్ బిల్డింగ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏ ఒక్క బయటి వ్యక్తి కూడా లేకుండా జాగ్రత్తలను తీసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డులతో పహారాను ఏర్పాటు చేశారు. నేషనల్ గార్డులు కేపిటల్ బిల్డంగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత పరిస్థితుల తీవ్రత కొంతమేర తగ్గుముఖం పట్టింది.

ఫోటోలు: వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసనలు

ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాల స్వీకరణ..

పార్లమెంట్ సమావేశాలు పునరుద్ధరించిన అనంతరం ఓట్ల లెక్కింపుపై చర్చను ప్రారంభించారు. ఉభయ సభల సమావేశానికి మైక్ పెన్స్ నేతృత్వాన్ని వహించారు. స్పీకర్ న్యాన్సీ పెలోసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. రాష్ట్రాలవారీగా ఈ అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతోంది. మూజువాణి ఓట్ల రూపంలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత కీలకమైన ఆరు రాష్ట్రాలు జార్జియా, పెన్సిల్వేనియా, అరిజోనా, విస్కాన్సిన్, ఫ్లోరిడా, టెక్సాస్‌లపై అందరి దృష్టీ నిలిచింది. పెన్సిల్వేనియా ఓట్ల లెక్కింపు 92-7 తేడాతో వీగిపోయింది.

అరిజోనా ఓట్ల లెక్కింపు పట్ల భారీగా అభ్యంతరాలు..

అరిజోనా స్టేట్ ఓట్ల లెక్కింపు పట్ల పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. అది కూడా వీగిపోయింది. 303-121 ఓట్ల తేడాతో ఈ తీర్మానం వీగిపోయింది. అభ్యంతరాలకు వ్యతిరేకంగా 303 ఓట్లు పోల్ అయ్యాయి. అనుకూలంగా 121 మంది ఓటు వేశారు. చాలావరకు అభ్యంతరాలు వీగిపోతుండటం వల్ల అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ పేరును కేపిటల్ బిల్డింగ్ ఆమోదించడం ఇక లాంఛనప్రాయమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నెల 20వ తేదీన అమెరికాలో అధికార మార్పిడి చోటు చేసుకోనుంది. అదే రోజు జో బిడేన్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

అంతకుముందు భారీ ఎత్తున హింస

నిజానికి ఈ ప్రక్రియ అంతా అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయమే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనల వల్ల జాప్యం చోటు చేసుకుంది. వేలాదిమంది డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ బిల్డింగ్‌ను చుట్టుముట్టడం, సభలోకి దూసుకెళ్లడం వంటి పరిణామాలు ఒకదాని వెంట ఒకటి సంభవించాయి. ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. చాలామందిని పోలీసులు అరెస్టు చేశారు. కేపిటల్ బల్డింగ్‌ను నేషనల్ సెక్యూరిటీ గార్డులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

English summary
Congressional leaders resumed the electoral vote count on Wednesday night after the Capitol building was secured. Vice President Mike Pence presided over the joint session of Congress as it reconvened after a violent mob earlier halted the ratification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X