పార్లమెంట్‌పై దండయాత్ర ఎఫెక్ట్..రెండో వికెట్: తప్పుకొన్న పోలీస్ చీఫ్: ట్రంప్ మద్దతుదారులపై
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో చోటు చేసుకున్న అల్లర్ల ప్రభావం.. అధికార, పోలీసు యంత్రాంగంపై తీవ్రంగా పడుతోంది. ఒకరి తరువాత ఒకరు రాజీనామాల బాట పడుతున్నారు. ఇప్పటికే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రీషం రాజీనామా చేశారు. అమెరికా పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన కొద్ది సేపటికే ఆమె గుడ్‌బై చెప్పారు. వైట్‌హౌస్ నుంచి వైదొలగారు. తాజాగా మరో వికెట్ పడింది.
Recommended Video
వాషింగ్టన్ యూఎస్ కేపిటల్ బిల్డింగ్ పోలీస్ ఉన్నతాధికారి స్టీవెన్ సండన్ తన పదవికి రాజీనామా చేశారు. అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. వేలాదిమందిగా పార్లమెంట్ భవనంపై దండెత్తిన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను నియంత్రించడంలో పోలీసులు విఫలం అయ్యారని, అందువల్లే నేషనల్ సెక్యూరిటీ గార్డులను రంగంలోకి దించాల్సి వచ్చిందంటూ విమర్శలు తలెత్తాయి.

ఈ ఉదంతంలో పోలీసు యంత్రాంగం దారుణంగా విఫలమైందంటూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన యూఎస్ కాంగ్రెస్, సెనెట్ సభ్యులు ఆరోపణలు గుప్పించారు. ఈ విమర్షలు చెలరేగిన కొన్ని గంటల్లో స్టీవెన్ సండన్ రాజీనామా చేశారు. ఇది ఈ నెల 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. యూఎస్ కేపిటల్ బిల్డింగ్ పోలీస్ చీఫ్‌గా పని చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని స్టీవెన్ తెలిపారు. వాషింగ్టన్‌లో చోటు చేసుకున్న అల్లర్లను తన 30 సంవత్సరాల సర్వీస్‌లో ఏనాడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫోటోలు: వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసనలు
తన కేరీర్‌లో ఈ ఘటన ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయి పోలీసులు హీరోయిజాన్ని ప్రదర్శించారని, ఆందోళనలు మరింత పెచ్చరిల్లకుండా అడ్డుకోగలిగారని ప్రశంసించారు. అంతకుముందు- యూఎస్ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ సైతం క్యాపిటల్ పోలీసుల పనితీరును ప్రశంసించారు. మరింత నష్టం సంభవించకుండా సమర్థవంతంగా అడ్డుకోగలిగారని పేర్కొన్నారు.
-
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications