వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యచరిత్రలో అపూర్వ ఘట్టం: వయొలిన్ వాయిస్తుండగా ఆపరేషన్, కణితి తీసిన లండన్ వైద్యులు (వీడియో)

|
Google Oneindia TeluguNews

మెదడు.. శరీరంలో ముఖ్యమైన భాగం, నాడులతో శరీరాన్ని మానిటర్ చేస్తుంటుంది. జీవనశైలి వల్ల మెదడులో కూడా గడ్డలు ఏర్పడుతోన్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిద్రలేమి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. లండన్‌కి చెందిన 53 ఏళ్ల డాగ్మార్ టర్నర్ వయొలిన్ ప్లే చేస్తుంటారు. అయితే ఆమె బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ ట్యూమర్‌తో ఆమె మళ్లీ వయొలిన్ వాయించలేదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె దిగాలు చెందింది. ఎలా అని తల పట్టుకొనే సమయంలో న్యూరో సర్జన్ కీమౌర్స్ అష్కాన్ పరిష్కారం చూపించారు.

వాయెలిన్ వాయిస్తుండగా..

వాయెలిన్ వాయిస్తుండగా..

డాగ్మార్ టర్నర్‌కు సాధారణంగా సర్జరీ చేస్తే స్పర్శ తగ్గి వయొలిన్ వాయించడం కష్టమవుతోంది. ఇందుకో అస్కాన్ సృజనాత్మకతతో ఆలోచించారు. ఆమె మెదడులో ఉన్న కణితి తొలగించే సమయంలో వయొలిన్ వాయించమని సలహా ఇచ్చారు. ఇందుకోసం రీహార్సల్ కూడా చేశారు. శస్త్రచికిత్సకు సర్వం సిద్ధం చేసుకొనే.. రెండుగంటల ముందు పరీక్షించి చూశారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకొన్న తర్వాత లండన్‌లోని కింగ్ కాలేజీ హాస్పిటల్‌లో సర్జరీ చేశారు.

వినూత్నంగా..

డాగ్మార్ టర్నర్ మెదడు ఎడమభాగం వెనకాల కణితి గుర్తించారు. ఇక్కడ శస్త్రచికిత్స చేయడం కష్టంతో కూడుకొన్నది. ఇందుకోసం సర్జరీ చేసే సమయంలో వయొలిన్ వాయించమని చెప్పారు. ఆమె వాయిస్తుండగా సర్జరీ చేసి.. చిన్న కార్డు పాటి ఉండే కణితిని అష్కాన్ బృందం తొలగించింది. ఇదివరకు 400 సర్జరీలు చేశామని వైద్యులు అష్కాన్ మీడియాకు వివరించారు. ఇదివరకు చేసిన సర్జరీలతో భాషపరమైన సమస్య ఉండేదని..ఆపరేషన్‌కు ముందు, తర్వాత లిఖితపూర్వకంగా పరీక్షించేవారని చెప్పారు.

రెండుగంటల ముందే..

రెండుగంటల ముందే..

ఈసారి మాత్రం రోగి వయొలిన్ వాయించగా శస్త్రచికిత్స నిర్వహించామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సర్జరీ చేయలేదని.. ఫస్ట్ టైం ఇలా చేశామని పేర్కొన్నారు. అంతేకాదు సర్జరీకి ముందు రెండు గంటల ముందునుంచే టర్నర్.. వయొలిన్ వాయించగా పరీక్షించామని గుర్తుచేశారు. ఆ సమయంలో ఎక్కడ ప్రతిస్పందన వస్తోందో చూసి.. నెమ్మదిగా కణితి తొలగించామని చెప్పారు.

90 శాతం కణితి..

90 శాతం కణితి..

టర్నర్ మెదడులో ఉన్న 90 శాతం కణితిని వైద్యులు విజయవంతంగా తొలిగించారు. అంతేకాదు ఎప్పటిలాగే ఆమె వయొలిన్ కూడా వాయించుకొనే వెసులుబాటు ఉంటుంది. సర్జరీ తర్వాత టర్నర్ తన భర్త, కుమారుడి వద్దకు వెళ్లిపోయింది. ‘శస్త్రచికిత్స పూర్తయ్యిందని, త్వరలోనే తాను వాయెలిన్ వాయిస్తాను అని' టర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

బాధపడి..

బాధపడి..

అంతకుముందు వైద్యులు తాను వయొలిన్ వాయించలేనని చెబితే బాధపడ్డానని గుర్తుచేశారు. తనకు పదేళ్ల వయస్సు ఉన్నప్పటీ నుంచి వయొలిన్ వాయిస్తున్నానని పేర్కొన్నారు. వయొలిన్ వాయించడం అంటే తనకు ఎంతో ఇష్టమని.. తన ఇష్టాన్ని వైద్యులు గుర్తించి, ఆ మేరకు చికిత్స చేయడం మరిచిపోలేనన్నారు.

English summary
Dagmar Turner wasn't just showing off when she played the violin during her brain surgery at King's College Hospital in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X