వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:యువర్ గ్రేట్ సాబిత్, 8వ ప్లోర్‌లో వేలాడిన చిన్నారిని కాపాడిన రియల్ హీరో..

|
Google Oneindia TeluguNews

పై అంతస్తులో ఎవరైనా చిక్కుకుంటే ఎక్స్‌పర్ట్స్ మాత్రమే సేవ్ చేయగలరు. అదీ 8, 10వ అంతస్తు అయితే మరీ కష్టం. అవును ఎందుకంటే రిస్క్ తీసుకుని మరీ కాపాడాల్సి ఉంటుంది. కజకిస్థాన్‌లో ఒకరు ఇలా హెల్ప్ చేశారు. ఓ బాలికను కాపాడి.. హీరోగా నిలిచారు. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తితున్నారు. ఆ వీడియోను మీరు చూడండి.

తల్లి షాపింగ్.. చిన్నారి కిటికీకి వేలాడుతూ

తల్లి షాపింగ్.. చిన్నారి కిటికీకి వేలాడుతూ

కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఓ చిన్నారి తల్లి షాపింగ్‌కు వెళ్లింది. ఇంట్లో మూడేళ్ల బాలిక ఒక్కతే ఉంది. ఇంకేముంది ఆమె బొమ్మలు, మెత్తలను ఉపయోగించి కిటీకి ఎక్కింది. అలా బయటకు వచ్చి.. రెండు చేతులు పట్టుకుని వేలాడింది. ఇదీ చూడటానికే భయంగా ఉంది. అలా రహదారిపై వెళ్లేవారు అందరూ చూస్తున్నారు. భయపడుతూ ఉన్నారు. కానీ సాబిత్ అనే ఒకరు ధైర్యం చేశారు. ఎలాగైనా ఆ చిన్నారిని కాపాడాలని అనుకున్నారు. అందుకోసం ముందడుగు వేశారు.

8వ ఫ్లోర్‌లో చిన్నారి

8వ ఫ్లోర్‌లో చిన్నారి

ఆ చిన్నారి ఇళ్లు 100 ఫీట్ల ఎత్తులో ఉంది. 8 ఫ్లోర్‌లో ఉండగా.. సాబిత్ ఏడో ప్లోర్ ఎక్కాడు. అక్కడే గల ఒఖ కిటికీ నుంచి బయటకు వచ్చాడు. మెల్లగా తనకు తాను అడ్జస్ట్ చేసుకున్నాడు. చిన్నారిని మాట్లాడించాడు కూడా. కాలు పట్టుకుని కిందకి లాగాడు. ఆమె వచ్చి అతని ఒడిలో పడింది. అలా ఆ చిన్నారినికి కిటికీల్లోంచి ఇచ్చేశాడు. ఈ వీడియో అక్కడ ఉన్న వారు చూశారు. ఊపిరి బిగపట్టి మరీ చూశారు.

గ్రేట్ సాబిత్

అలా చిన్నారిని సాబిత్ కాపాడారు. రియల్ హీరోగా నిలిచారు. సాబిత్‌ను కజకిస్తాన్ ప్రభుత్వం హీరోగా అభివర్ణించింది. అవార్డు కూడా ఇచ్చి గౌరవించింది. అయితే అప్పటికే రెండు వాహనాల్లో ఏడుగురు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ సాబిత్ చిన్నారిని క్షేమంగా కాపాడగలిగారు. నెటిజన్లు అతనికి నీరాజనం పలుకుతున్నారు. నిజంగా సాబిత్ వల్లే ఆ చిన్నారికి మరో జన్మ వచ్చినట్టు అయ్యింది. అంతటి ఉత్కంఠభరిత పరిస్థితిలో మరొకరు సేవ్ చేసినా.. అదీ రిస్కే కానుంది.

English summary
sabith in Kazakhstan is being hailed as a hero as he risked his life to save a three-year-old girl from falling from a height of 100-feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X