Viral Video: కారు పై పడిన పిడుగు.. సోషల్ మీడియాలో వైరల్ షాకింగ్ వీడియో..

వర్షకాలంలో పిడుగులు పడడం సాధారణం. అయితే పిడుగులు ఎతైన చెట్లపై, భవనాలపై పడతాయి. కానీ ఓ చోట రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ దృశ్యాలను వెనక కారులో వస్తున్న వారు సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఫ్లోరిడాలో ఒక మహిళ కారులో వెళ్తోంది. ముందు ఆమె భర్త మరో కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం వస్తుంది.

భారీ శబ్దం
ఇలా వెనక నుంచి ఆమె తన భర్తను ఫొటోలు, వీడియోలు తీస్తోంది. ఇంతలో భారీ శబ్దంతో ముందు వెళ్తున్న కారు పై పిడుగు పడింది. ఈ దృశ్యాలు భార్య ఫోన్ లో రికార్డయ్యాయి. ఎడ్వర్డ్ వేలెన్ అనే వ్యక్తి జూలై 1వ తేదీన సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉరుములతో కూడిన గాలివానలో కారు నడుపుతున్నాడు. అతని వెనుక అతని భార్య మైఖేల్ మరో కారులో వస్తుంది. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన మెరుపు మెరుపు ఎడ్వర్డ్ కారుపై పడింది. ట్రక్ నుంచి మంటలు, నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. ఇదంతా వెనక ఉన్న అతని భార్య మొబైల్ లో రికార్డ్ చేసింది. ఈ ప్రమాదంలో ఎడ్వర్డ్ గాయపడలేదు.

Viral Video: Scary Moment Lightning Strike Fries Pickup Truck in Florida Caught on Camera. Watch

నా కుమార్త భయపడింది
"మమ్మల్ని ఢీకొన్నప్పుడు మీరు కారులో కొంచెం సందడి చేసినట్లు అనిపించవచ్చు, ఆపై నా పెద్ద కుమార్తె నా పక్కన కూర్చుంది. ఆమె నా ఒడిలోకి దూకి అరిచింది." ఎడ్వర్డ్ చెప్పాడు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, పిడుగులు సాధారణంగా కార్లకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. తరచుగా విద్యుత్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. టంపాలోని FOX13లో ముఖ్య వాతావరణ శాస్త్రవేత్త పాల్ డెల్లెగాట్టో ఈ వీడియోను ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+