Viral Video: అదృష్టమంటే ఇతనిదే.. త్రుటిలో తప్పించుకున్నాడు.. వీడియో వైరల్..
ఎప్పుడు ఏం జరుగుతోంది ఎవరు చెప్పలేరు. కానీ ఏది జరిగినా మన మంచికే అంటారు. కానీ టైమ్ బాగా లేకపోతే ఏదైనా జరుగొచ్చు.. అదృష్టం బాగుంటే కూడా ఏదైనా జరుగొచ్చు. ఇలానే ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.
ఫుట్ పాత్ పైకి
రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్లినా ఎదుటివాడు జాగ్రత్తగా వస్తేనే అందరు భద్రంగా ఉంటారు. కానీ ఫుట్ పాత్ పై నుంచి వెళ్లే వారికు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫుట్‌పాత్‌పై ట్రక్కు ఢీకొనడంతో ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా అక్కడ షాప్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ప్యాసేజ్‌లో నిలబడి తన చేతిలో ఉన్న పేపర్ ను చదువుతున్నాడు. ఇంతలో అతనిపైకి ఒక ట్రక్కు దూసుకొచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అతను గాయపడలేదు.

లక్షల్లో వ్యూస్
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు, వీడియో 4.4 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది. "జీవితం చాలా అనూహ్యమైనది!" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
Life is Sooooooo unpredictable! pic.twitter.com/tFZQ1kJf74
— Dipanshu Kabra (@ipskabra) July 7, 2022












Click it and Unblock the Notifications