వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కన్యత్వ భావనకు కాలం చెల్లిందా

'కన్యత్వం' అనే పదం పాతబడిందా లేక అసలు ఆ భావనకు కాలం చెల్లిందా?

కన్యత్వం అనే భావనతో చాలా సమస్యలు ఉన్నాయని, తొలి లైంగిక అనుభవాలను చర్చించడానికి అనువైన ప్రత్యామ్నాయ పదం అవసరమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

సంప్రదాయకంగా కన్యత్వాన్ని ఒక లైంగిక చర్యగానే పరిగణిస్తూ అందులో ఏర్పడే సాన్నిహిత్యాన్ని విస్మరిస్తున్నారని లైంగిక విద్యా నిపుణులు అంటున్నారు.

కన్యత్వం లేదా శీలం అనే పదాలను మహిళలకు మాత్రమే వర్తించేలా వ్యవహరిస్తూ, కన్యత్వం 'కోల్పోయింది’, కన్యత్వం 'సమర్పించుకుంది’ అంటూ దానికి అక్కర్లేని విలువలు ఆపాదిస్తున్నారన్నది స్త్రీవాదులు ఆరోపణ.

కన్యత్వాన్నిఆడ, మగ మధ్య విషయంగానే చూస్తున్నారని, ఇతర లైంగిక సంబంధాలకు వర్తించే విషయంగా భావించట్లేదని క్వీర్ (ఎల్జీబీటీ సభ్యులు) సమూహం వాదన.

కన్యత్వ భావనకు కాలం చెల్లిందా

'సెక్సువల్ డెబ్యూ'

ఎంతోమంది ఈ భావనను ఒక సమస్యగా చూస్తున్నారుగానీ దీనికొక పరిష్కారం సూచించిన వాళ్లు లేరు.

ఈ నేపథ్యంలో, గత ఏడాది కెనడాలోని టొరంటోకు చెందిన నికోల్ హాడ్జెస్ 'కన్యత్వం' అనే భావనను ప్రతిఘటించడం ప్రారంభించారు.

హాడ్జెస్ తనను తాను "లైంగిక స్వేచ్ఛా తత్వవేత్త" (సెక్సువల్ ఫ్రీడం ఫిలాసఫర్)గా పేర్కొంటారు.

తన భావాలను వ్యక్తపరిచేందుకు హాడ్జెస్.. అమెరికన్ రచయిత, ఫిల్మ్‌మేకర్, పొలిటికల్ కార్టూనిస్ట్ అయిన డాక్టర్ సూస్ శైలిని సాధనంగా ఎన్నుకొన్నారు.

2020లో సూస్ శైలిని అనుకరిస్తూ 'ఓహ్, ది ప్లేసెస్ యూ విల్ గో ఓహ్ ఓహ్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. కవిత్వంలా సాగే ఈ రచనలో, సరదా శైలిలో మహిళల భావప్రాప్తికి ఉన్న శక్తిని, జీవితం లైంగిక అనుభవాల వేడుకగా ఎలా సాగాలో చర్చించారు.

సెక్సువాలిటీని ఒక ప్రయాణంగా అభివర్ణిస్తూ, ఈ ప్రయాణానికి ఒక ప్రారంభం అవసరమని హాడ్జెస్ గుర్తించారు.

అయితే, సంప్రదాయకంగా వస్తున్న ఆరంభానికి కాలం చెల్లిందని ఆమె భావించారు.

లైంగిక వ్యక్తీకరణ, స్వేచ్ఛ, పురుషస్వామ్యానికి వ్యతిరేకంగా స్త్రీ సాధికారత, లింగ నిబంధనల విస్తరణ గురించి ఆమె చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కన్యత్వం, దాని చుట్టూ అల్లుకున్న సంప్రదాయ భావనల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.

"మనం ఇంకా పాతబడిన, బలహీనమైన పదాన్నే వాడుతున్నాం. ఆ పదం లైంగిక అనుభవాల విస్తరణ అనే భావనను కుదించేస్తుంది" అంటారు హాడ్జెస్.

కన్యత్వానికి బదులు ఓ కొత్త పదాన్ని కనిపెట్టారు ఆమె.

కన్యత్వం, శీలం అనేవి పాతబడిన, కాలం చెల్లిన పదాలని వాటికి బదుకు "సెక్సువల్ డెబ్యూ" (తొలి లైంగిక అనుభవం) అనే పదబంధం వాడాలని హాడ్జెస్ సూచించారు.

ఈ పదబంధం వాడుకలో ఉన్నదే. హాడ్జెస్ మొదటిసారి వాడినది కాదుగానీ, సూసియన్ శైలిలో రాసిన తన పుస్తకానికి ఇదే సరైన పేరని ఆమె భావించారు.

ఈ పదం అర్థం చేసుకోవడానికి కష్టమైనదేం కాదు. సూటిగా ఉన్న పదమే కానీ ఆమె పుస్తకం చదివిన తరువాత పాఠకులు దీని అర్థాన్ని వివరించమని కోరడంతో హాడ్జెస్

దాంతో, సెక్స్ పట్ల సానుకూలతను పెంపొందించే దిశగా కన్యత్వానికి బదులుగా సెక్సువల్ డెబ్యూ అనే పదాన్ని ఉపయోగించాలనే ప్రచారాన్ని ప్రారంభించారు హాడ్జెస్ ఆశ్చర్యానికి లోనయ్యారు.

శిక్షణ పేరుతో పెళ్లి చేసేశారు

సోషల్ మీడియాలో ప్రచారం

ఇన్స్టాగ్రాం, ట్విట్టర్లలో ఆమె పోస్టులు చాలా పాపులర్ అయ్యాయి. ఈ మార్పును సూచిస్తూ టీ షర్టులు ముద్రించమని ఎంతోమంది కోరారు.

ఈ ప్రచారం రెండో దశలో, సెక్సువల్ డెబ్యూ పదబంధం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పించి వాటి వీడియోలను ప్రచారం చేశారు. అలాగే ఆ భావనను చాటిచెప్పే జింగిల్ ఒకటి విడుదల చేశారు.

సోషల్ మీడియాలో హాడ్జెస్ ప్రచారానికి వచ్చిన స్పందన చూస్తే, ప్రారంభ లైంగిక అనుభవాల విషయంలో ఒక చర్చను ప్రారంభించడంలో ఆమె సఫలీకృతమయ్యారని తెలుస్తుంది.

అయితే, ఈ అంశంపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఇలాంటి ఒక పదబంధం వాడుకకు నాంది పలికినందుకు ఎంతోమంది కృతజ్ఞతలు తెలిపారు.

హాడ్జెస్‌కు మద్దతు ఇచ్చిన వారంతా కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందని విశ్వసిస్తున్నావారే.

సెక్సువల్ డెబ్యూ అనే పదబంధం లైంగిక స్వేచ్చకు, అనుభవాలకు ఒక కొత్త దృక్పథాన్ని చేకూర్చి పెట్టిందని, వ్యక్తిగత స్వేచ్ఛకు, సానిహిత్యానికి కొత్త అర్థాన్ని సృష్టించిందని పలువురు భావిస్తున్నారు.

లైంగిక అనుభవాల ప్రారంభ దశను ఈ పదం సరళంగా చేసిందని, సూటి అర్థాన్ని సూచిస్తోందని హాడ్జెస్ అంటారు.

ఇది మరింతమందిని కలుపుకొని, సాధికారతకు అద్దం పడుతుందని ఆమె ఆశిస్తున్నారు.

కన్యత్వ భావనకు కాలం చెల్లిందా

'సెక్సువల్ డెబ్యూ' పదబంధం పుట్టుక, అభివృద్ధి

ఈ పదం కొత్తగా పుట్టినదేం కాదు. చాలాకాలంగా ఉన్నదే. కన్యత్వం కోల్పోవడాన్ని వైద్య పరిభాషలో సెక్సువల్ డెబ్యూ అని మొదట్లో అనేవారని అమెరికాలోని టేనస్సీకి చెందిన వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ లారా ఎం కార్పెంటర్ చెప్పారు.

కార్పెంటర్, "వర్జినిటీ లాస్ట్: ఏన్ ఇంటిమేట్ పోర్ట్రైట్ ఆఫ్ ఫస్ట్ సెక్సువల్ ఎక్స్పీరియన్సెస్" అనే పుస్తకంతో పాటు కన్యత్వానికి సంబంధించిన అనేక వ్యాసాలను రచించారు.

"70, 80లలో వచ్చిన వైద్య అధ్యయనాల్లో సెక్సువల్ డెబ్యూ అనే పదం కనిపిస్తుంది. అప్పట్లో దీన్ని టీనేజ్ గర్భం, ఎస్టీఐల అంటువ్యాధిగా పరిగణించేవారు" అని కారోంటర్ తెలిపారు.

"యోని ద్వారా జరిగే మొదటి సెక్స్‌ను సూచించడానికి 'సెక్సువల్ డెబ్యూ' అని వాడేవారు. అప్పట్లో ఒకటో రెండో అధ్యయనాల్లో 'కన్యత్వం కోల్పోవడం' అని వాడి ఉండొచ్చు. కానీ 'సెక్సువల్ డెబ్యూ'నే సంస్కారవంతమైన పదంగా వాడేవారు. 80, 90లలో 'మొదటి కలయిక', 'మొదటి యోని సంభోగం' అని స్పష్టంగా చెప్పేవారు ఎందుకంటే ఈ పదాలు మరింత కచ్చితంగా, నిర్దుష్టంగా ఉంటాయి.

పదాలు, వాటి అర్థాలు చాలా సంఘంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని, కొత్త పదాలు సృష్టించడం, వాటి అర్థాలను తిరగరాయడం ఎంతో ముఖ్యమని కార్పెంటర్ అంటారు.

నైతికతతో నిండిపోయిన భాషలో సెక్స్‌ను సూటిగా, స్పష్టంగా సూచించే పదాలు అరుదేనని ఆమె అన్నారు.

1990లలో కార్పెంటర్ ఈ అంశంలో తన పరిశోధన ప్రారంభించారు. ఒకే స్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లో సెక్స్ పట్ల అవగాహన భిన్నంగా ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయని ఆమె తెలిపారు.

అంటే కన్యత్వం కోల్పోవడం అనే భావనను అనేక రకాలుగా నిర్వచించవచ్చు. చాలావరకు దీన్ని ఒక సిగ్గుమాలిన పనిగా, అనైతికమైన చర్యగా భావిస్తారు.

ఈ అనైతిక, సిగ్గుచేటు లాంటి భావనలను ప్రతిఘటించడానికే హాడ్జెస్ తన ప్రచారాన్ని ప్రారంభించారు.

సెక్సువల్ డెబ్యూ అనేది జీవితంలో ఒక కొత్త దశకు, ఓ కొత్త ప్రయాణానికి పునాది వేస్తుందని, "కన్యత్వం అనేది ఒక ప్రయాణానికి ముగింపు కాదు. పరివర్తన అంతకన్నా కాదు" అని హాడ్జెస్ అంటారు.

మరో రకంగా సెక్సువల్ డెబ్యూ అనేది లైంగిక అనుభవం జీవితంలో అనేకసార్లు, అనేక విధాలుగా జరగవచ్చనే భావనను ప్రోత్సహిస్తుందని ఆమె అంటారు.

"కన్యత్వం అనే పదాన్ని మరో పదంతో భర్తీ చేయడం కాదు మా ఉద్దేశం. కన్యత్వం అనే భావన అసలు ఉండనే ఉండదు, ఎందుకంటే లైంగిక ప్రయాణం అనేదానికి అంతం లేదు."

సెక్సువల్ డెబ్యూ అనేది భావోద్వేగాలను ప్రతిబింబించే వ్యక్తిగత ఎంపికలోని మార్పులను సూచిస్తుందని హాడ్జెస్ అన్నారు.

"ఒక అమ్మాయి, మరొక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నప్పుడు, తన శరీరంలో కలిగే అలజడి కూడా సెక్సువల్ డెబ్యూ కావొచ్చు. తనకేం కావాలో తెలుసుకునే క్షణం అది. వ్యక్తిగత అభిరుచులను, ఎంపికను గుర్తించే క్షణం అది. సెక్సువల్ డెబ్యూ అనేక ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా జరగవచ్చనేది గుర్తిస్తే, 'తొలిసారి' అనే అంశానికి ఇచ్చే అనవసర ప్రాధాన్యం తగ్గుతుంది.

నవ వధువు

మార్పు ఇంత తేలికా?

ఒక పదం మార్చడం ద్వారా మార్పు సాధ్యమేనా? అంటూ హాడ్జెస్ ప్రచారంపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

ఒకప్పుడు వైద్య అధ్యయనాల్లో ఉపయోగించే పదాన్ని మళ్లీ వాడుకలోకి తెచ్చారే తప్ప కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందనే విషయంలో అవగాహన కల్పించడంలో ఎక్కువ దూరం వెళ్లలేదని కాలిఫోర్నియాకు చెందిన సెక్స్ ఎడ్యుకేటర్ జూలియా ఫెల్డ్‌మన్-డికౌడ్రాక్స్ అభిప్రాయపడ్డారు.

"మనం మరొక ప్రత్యామ్నాయ పదాన్ని కనిపెట్టే ఆరాటంతో లోపభూయిష్టమైన ఒక భావనను పదే పదే చర్చిస్తున్నాం. లైంగిక అనుభవాలను చర్చించడానికి మనం ఉపయోగించే భాషా నిర్మాణంలోనే లోపం ఉంది" అని ఫెల్డ్‌మన్-డికౌడ్రాక్స్ అంటారు.

"కన్యత్వం, సెక్సువల్ డెబ్యూ లాంటి పదాలు ఉపయోగిస్తున్నామంటే, ఒక వ్యక్తికి మరో వ్యక్తితో ఉండే సాన్నిహిత్య సంబంధాన్ని నిర్వచిస్తున్నట్లు లెక్క. ఒక లైంగిక అనుభవంలో ఇద్దరు వ్యక్తులు భాగస్వామ్యం పంచుకోవాలి. ఇక్కడే చాలామంది గందగోళ స్థితిలో, నిరాశలో పడిపోతారు. 'నా భాగస్వామి నాకు భావప్రాప్తిని అందించడు' అని కొందరు చెబుతుంటారు. అంటే ఒకరి లైంగిక ఆనందం ఇంకొకరిపై ఆధారపడి ఉంటుంది. ఇది మనల్ని వ్యక్తిగత గుర్తింపు, సెక్సువాలిటీ నుంచి దూరం చేస్తుంది" అని ఫెల్డ్‌మన్-డికౌడ్రాక్స్ వివరించారు.

అయితే, కన్యత్వం అనే భావనతో చాలా సమస్యలున్నాయనే హాడ్జెస్ అభిప్రాయంతో ఫెల్డ్‌మన్-డికౌడ్రాక్స్ అంగీకరిస్తారు.

"ఇలాంటి ప్రమాదకరమైన నిర్వచనాలను దాటిరావడమే మేలు. సెక్సువాలిటీ అనేది ఒకచోట ప్రారంభం అవుతుందనే తప్పుడు భావన నుంచి బయటపడాలి. మన మిగతా జీవితాన్ని ఆ ఒక్క క్షణం ఎలా నిర్వచించగలదు? జీవితంలో కలిగే అనేక రకాల లైంగిక అనుభవాలకు ఇంక విలువ లేనట్టేనా? తొలిసారి జరిగినదానికేనా విలువ?" అంటూ ఫెల్డ్‌మన్-డికౌడ్రాక్స్ ప్రశ్నిస్తున్నారు.

ఆ ఒక్క క్షణం గురించి కాదు

జీవితంలో తొలిసారి జరిగినవాటిని గుర్తుంచుకోవడం, తీపి గుర్తులుగా భావించడం సహజమేనని కార్పెంటర్ అంటారు.

మొదటి బిడ్డ పుట్టడం, మొదటిసారి స్కూలుకు వెళ్లడం లాంటివన్నీ మనం గుర్తుంచుకుంటాం. అలాగే తొలి లైంగిక అనుభవం కూడా సాంఘికంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అయినప్పటికీ, లైంగికతపై మన అవగాహనను విస్తరించుకుంటే కన్యత్వం అనే భావనకు కాలం చెల్లక మానదని ఆమె అన్నారు.

"తొలిసారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చినా, అది అక్కడితో ఆగిపోదు. వ్యక్తులు మెల్లిగా లైంగిక అనుభవాలను పోగుచేసుకుంటూ ఉంటారు. కొన్నాళ్లకు ఈ తొలి అనుభవం కూడా మిగతా అనుభవాల మధ్యలో ఎక్కడో కొట్టుకుపోతుంది. కాబట్టి తొలి అనుభవానికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు" అని కార్పెంటర్ అభిప్రాయపడ్డారు.

అందుకే హాడ్జెస్, ఫెల్డ్‌మన్-డికౌడ్రాక్స్ సూచిస్తున్న మార్పులు చాలా ముఖ్యమని, సమాజం మారుతుంటే, పాతబడిన భావాలకు స్వస్తి చెప్పడం కూడా అవసరమని ఆమె అన్నారు.

"కన్యత్వం అనేది 'ఒక్క క్షణం' భావనగా చూడడం మానేయాలి. ఆ క్షణంతో జీవితం మొత్తం మారిపోతుందనే భావనకు స్వస్తి చెప్పాలి. ఆ క్షణం అందరికీ కచ్చితంగా తొలి అనుభవంగా ఉంటుందనీ చెప్పలేం. కొందరికి కచ్చితంగా అది తొలి అనుభవం కావొచ్చు. మన సమాజం అభివృద్ధి చెందిన విధానంలో తొలిసారి అందరికీ ఒకేలాంటి అనుభవాలు కలుగుతాయని చెప్పలేం. దాని గురించి మనం గొడవ చేయకపోతే ఎప్పటికైనా అది ఒక సమస్యగా కనిపిస్తుందా?" అని కార్పెంటర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Virginity: Is the concept of virginity long overdue?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X