వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూతన అమెరికా కోసం ఓటు వేయండి: ఒబామాతో కలిసి జో బైడెన్ పిలుపు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వీరు పిలుపునిచ్చారు.

నూతన అమెరికా కోసం ప్రతి అమెరికన్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అంతేగాక, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒమాతో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. 'బరాక్ ఒబామా నేతృత్వంలో 2008, 2012 ఎన్నికల్లో దేశాన్ని ముందుండి నడిపించంలో మీరు నాపై నమ్మకం ఉంచారు. ప్రస్తుతం నేను, కమలా హారీస్ కలిసి పోటీ చేస్తున్నందున.. మాపై మరోసారి విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని జో బైడెన్ వ్యాఖ్యానించారు.

Vote for new america: Joe biden to US people

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ప్రజల మన్ననలను చూరగొంటామని అని బైడెన్ అన్నారు. ప్రజలను నిరాశపర్చమని హామీ ఇస్తున్నామని జో బైడెన్ స్పష్టం చేశారు. కొత్త అమెరికాను తీర్చిదిద్దుతామని అన్నారు.

కాగా, అమెరికా ఎన్నికలు ఇప్పటికే ప్రారంభం కాగా, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, నవంబర్ 3న మరో 6 కోట్ల మంది ఓటు వేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

ప్రీపోల్స్ సర్వేలో జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో కొనసాగుతున్నట్లు చెబుతున్నాయి. అయితే, గతంలో బైడెన్ కంటే.. చాలా వెనుకబడి ఉన్న ట్రంప్.. గత కొద్ది రోజుల్లోనే బాగా పుంజుకున్నారు. అయినా బైడెన్ స్వల్ప ఆధిక్యతను చూపుతున్నారని తెలిపాయి. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చినతర్వాతే అసలు విజయం ఎవరిదనేది తేలనుంది.

English summary
Vote for new america: Joe biden to US people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X