వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:ఓరయ్యా ఏందిదీ, అనకొండతో ఎకసెకలా, పంచ్ ఇవ్వడంతో..

|
Google Oneindia TeluguNews

మృగాలతో.. అనకొండలతో జోక్స్ వద్దు. అవీ అల్లంత దూరానా ఉంటేనే గజ గజ భయపడిపోతుంటాం. కానీ ఓ గైడ్ సాహసమే చేశాడు. చక్కగా ఉన్న అనకొండను గెలికాడు. వెకిలి నవ్వులు నవ్వాడు. ఓయ్,, ఊయ్ అంటూ దానిని డిస్టర్బ్ చేశాడు. ఇంకేముంది నీటిలో ఉన్న అదీ నోటులో ఉన్న అతనిపై దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 20 సెకన్ల నిడివి గల ఆ వీడియోను మీరు కూడా చూడండి.

ఒక్కసారిగా వచ్చిన అనకొండ

ఒక్కసారిగా వచ్చిన అనకొండ

వీడియోను ఫిష్సింగ్ గైడ్ జోవో సెవెరిన్ షేర్ చేశారు. గత నెల 30వ తేదీన టూరిస్టులతో కలిసి బ్రెజిల్‌లో గల గోయాస్ అరగ్వాయా నదిలో బోటులో ఉన్నారు. అతని బోటులో పర్యాటకులు కూడా ఉన్నారు. అయితే రెండు చెక్క దుంగల మధ్య అనకొండ కనిపించింది. దానిని చూసి జోవో కామెంట్ చేయడం ప్రారంభించాడు. ఇంకేముంది దానికి కోపం వచ్చింది.. జోవోపై ఆమాంతం లేచి దాడి చేసింది. అయితే అతను తృటిలో తప్పించుకున్నాడు. ఒక్కసారిగా అనకొండ రావడంతో పడవలో ఉన్న వారంతా బెంబేలెత్తిపోయారు. దాడి తర్వాత కూడా జోవో.. భయంతో నవ్వే ప్రయత్నం చేశాడు. అప్పుడు గానీ అతనికి అనకొండలతో సరసాలు ఆడటం తప్పు అని తెలియరాలేదెమో.

మీరు చూడండి అబ్బాయిలు

అబ్బాయిలు అనకొండను చూశా.. మీరు కూడా చూడండి అని అన్నాడు. దానిని వీడియో తీస్తున్నానని చెప్పాడు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ చేసింది. కానీ అనకొండ ఒక్కసారిగా రావడంతో అందులో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే అనకొండ కాటు చర్మంలోకి చొచ్చుకొని వెళ్లలేదు. దీంతో అతనికి ప్రాణపాయం తప్పింది.

30 అడుగుల పొడవు

30 అడుగుల పొడవు

సాధారణంగా అనకొండలు 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. బోవా తెగకు చెందిన గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి పెద్ద పాముగా నిలిచింది. మగ అనకొండల కంటే.. ఆడవే చాలా పెద్దగా ఉంటాయని నేషనల్ జియోగ్రాఫిక్ రిపోర్ట్ చేసింది. అనకొండలు చిత్తడి నేతలు, నెమ్మదిగా కదిలే ప్రవాహల్లో ఉంటాయి. అమెజాన్ అడవుల్లో.. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. నీటిలో మాత్రం కనిపించకుండా.. అడుగున ఉంటాయి. ఇవీ అడవి పందులు, జింకలు, పక్షులు, తాబేళ్లు వేటాడుతాయి. కొన్ని చిరుత పులులను కూడా వేటాడుతాయని తెలిసింది.

English summary
Brazilian fishing guide Joao Severino narrowly avoided losing his life when he was attacked by an anaconda snake. anaconda leaping out of water and biting him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X